Kavya Kalyanram చైల్డ్ ఆర్టిస్ట్ గా సత్తా చాటి ఇప్పుడు హీరోయిన్ గా రాణిస్తున్న కావ్య కళ్యాణ్ రాం సినిమాల విషయంలో ఆచి తూచి అడుగులేస్తుంది. బలగం సినిమాతో సక్సెస్ అందుకున్న అమ్మడు సిం హా హీరోగా చేసిన ఉస్తాద్ తో చివరగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే ఈ సినిమా ఆశించిన ఫలితాన్ని అందుకోకపోవడం వల్ల కావ్యకి ఆఫర్లు రాలేదు. అవకాశాల కోసం అమ్మడు రకరకాల ఫోటో షూట్స్ తో రచ్చ చేస్తుంది.
బలవం కావ్యకి ఫైనల్ గా మెగా ఆఫర్ వచ్చినట్టు తెలుస్తుంది. మెగా మేనల్లుడు సాయి దుర్గ తేజ్ సినిమాలో అమ్మడు ఛాన్స్ అందుకుందని టాక్. హనుమాన్ ప్రొడ్యూసర్ నిరంజన్ రెడ్డి నిర్మాణంలో రోహిత్ అనే కొత్త కుర్రాడి డైరెక్షన్ లో సాయి తేజ్ సినిమా వస్తుంది. ఈ సినిమాకు సంబరాల ఏటి గట్టు టైటిల్ పరిశీలనలో ఉంది. సినిమాలో కావ్య హీరోయిన్ గా ఛాన్స్ అందుకుందా లేదా సెకండ్ హీరోయిన్ గా ఆమెను తీసుకున్నారో కానీ మొత్తానికి మెగా మేనల్లుడి సినిమాలో అమ్మడు ఛాన్స్ అందుకుందని తెలుస్తుంది.
వచ్చిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగ పరచుకుంటున్న కావ్య కచ్చితంగా ఈ ఆఫర్ కెరీర్ కి మంచి బూస్ట్ ఇస్తుందని చెప్పొచ్చు. సినిమాలు లేని టైం లో ఫోటో షూట్స్ తో ప్రేక్షకులను మెప్పిస్తున్న అమ్మడు సినిమాలతో కూడా తన సత్తా చాటాలని చూస్తుంది.
Also Read : Prabhas Kalki : కల్కిలో ఆ ఇద్దరు హీరోయిన్స్.. వారెవా అనిపించేలా నాగ్ అశ్విన్ ప్లాన్..!