Katrina Kaif : వాటితోనే కోట్లు సంపాదిస్తున్న కత్రినా.. ఇక సినిమాలు ఎందుకు..?

ఇన్ స్టాగ్రాం (Instagram) లో 80 మిలియన్ల కన్నా ఎక్కువ ఫాలోవర్స్ ఉన్నారు. అమ్మడు ఒక్కసారి ఏదైనా ఒక బ్రాడ్ ని తన సోషల్ మీడియాలో పెడితే డైరెక్ట్ గా 80 లక్షల మందికి

  • Written By:
  • Publish Date - July 18, 2024 / 05:21 PM IST

బాలీవుడ్ క్రేజీ హీరోయిన్ కత్రినా కైఫ్ ఇప్పటికీ ఒక రేంజ్ లో తన ఫాం కొనసాగిస్తున్నారని చెప్పొచ్చు. హిందీ పరిశ్రమలో తనకంటూ ఒక మార్క్ సెట్ చేసుకున్న కత్రినా కైఫ్ (Katrina Kaif) ఆఫ్టర్ మ్యారేజ్ కూడా తన సత్తా చాటాలని చూస్తున్నారు. ఐతే పెళ్లి తర్వాత అటు కమర్షియల్ సినిమాలతో పాటు వెరైటీ కథలతో సినిమాలు చేస్తుంది కత్రినా.

ఐతే కత్రినా గురించి ఒక న్యూస్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అమ్మడు తన సోషల్ మీడియా తో భారీగా సంపాదిస్తుందట. తారలు తమ సోషల్ మీడియా క్రేజ్ తో కోట్లు గడిస్తున్నారని తెలిసిందే. ఈ క్రమంలో కత్రినా కూడా తనకున్న ఫాలోవర్స్ తో భారీ మొత్తంలో సంపాదిస్తుందని తెలుస్తుంది.

కత్రినా కైఫ్ కు ఇన్ స్టాగ్రాం (Instagram) లో 80 మిలియన్ల కన్నా ఎక్కువ ఫాలోవర్స్ ఉన్నారు. అమ్మడు ఒక్కసారి ఏదైనా ఒక బ్రాడ్ ని తన సోషల్ మీడియాలో పెడితే డైరెక్ట్ గా 80 లక్షల మందికి అది చేరుతుంది. అందుకు గాను కరినాకు భారీ రేంజ్ లో రెమ్యునరేషన్ ఇస్తున్నారట. అందుకే కత్రినా ఈమధ్య సినిమాలు తగ్గించి పూర్తిగా సోషల్ మీడియా ప్రమోషన్స్ చేస్తుందని అంటున్నారు.

కత్రినా కైఫ్ చివరగా మెర్రీ క్రిస్ మస్ సినిమా చేసింది. ఆ తర్వాత రెండు సినిమాలు సెట్స్ మీద ఉన్నాయి. ఈమధ్యనే కత్రినా కైఫ్ ప్రెగ్నన్సీ న్యూస్ ను తోసిపుచ్చాడు ఆమె భర్త విక్కీ కౌశల్ (Vicky Kaushal). కత్రినాకు తెలుగులో కూడా మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. అమ్మడు తెలుగులో వెంకటేష్, బాలకృష్ణ ఇద్దరితో కలిసి నటించింది. ఐతే ఆ తర్వాత బాలీవుడ్ లోనే బిజీ అయిన అమ్మడు మళ్లీ టాలీవుడ్ వైపు చూడలేదు.

Also Read : Kavya Thapar : కావ్య టాప్ గేర్ వేసింది.. ఇస్మార్ట్ అందాల జాతర..!

Follow us