Site icon HashtagU Telugu

Katrina Kaif: పబ్లిక్ పార్కులో కత్రినా.. ఫొటోలు తీయొద్దంటూ వార్నింగ్!

Katrina

Katrina

హీరోహీరోయిన్లు బయటకు వస్తున్నారంటే అందరి కళ్లు వాళ్ల మీద పడటం చాలా కామన్. జనాలు, ఫోటో గ్రాఫర్లు ఫొటోలు, వీడియోలు తీయడం ఇంకా కామన్. ఫొటోలు తీస్తున్న సమయంలో బాలీవుడ్ హీరోయిన్ కత్రినా సీరియస్ అయ్యింది. ప్రస్తుతం ముంబైలో ఉన్న నటి కత్రినా కైఫ్ నిన్న సాయంత్రం తన క్లోజ్ ఫ్రెండ్, ఫిట్‌నెస్ ట్రైనర్ యాస్మిన్ కరాచీవాలాతో కలిసి పబ్లిక్ లో కనిపించింది. ఓ పార్క్‌లో కసరత్తు చేస్తుండగా, స్థానికులు కొందరు ఫొటోలు, వీడియోలు తీయడానికి ప్రయత్నించారు. దీంతో కత్రినావారిపై మండిపడింది.

తన వైపు వస్తున్న వాళ్లను చూసి కారు డోర్ వేసేసుకుంది. వాళ్లు డోర్ తీయమని కోరగా, కత్రినా మాత్రం కెమెరాలను దూరంగా ఉంచండి అని సీరియస్ అయ్యింది. నేను ఎక్సర్ సైజ్ చేయడానికి వచ్చానని, ఫొటోలు ఎందుకు తీస్తున్నారని మండిపడింది. “ఆప్ లాగ్ కెమెరా నీచే రఖో, హమ్ యహాన్ వ్యాయామం కర్నే ఆయే హైన్. (కెమెరాలను తీసేయండి. మేం వ్యాయామం చేయడానికి ఇక్కడ వచ్చాం) అని ఘాటుగా బదులిచ్చింది. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు వైరల్ గా మారాయి.

 

Exit mobile version