Karwa Chauth :మొదటిసారిగా భర్తతో కలిసి కర్వాచౌత్ లో కత్రీనా కైఫ్…వైరల్ పిక్స్..!!

బాలీవుడ్ బ్యూటీ కత్రీనాకైఫ్...తన భర్తతో కలిసి మొదటిసారిగా కర్వాచౌత్ లో పాల్గొన్నది. కత్రినా ఈ పండుగను తన అత్తగారింట్లో ఘనంగా సెలబ్రేట్ చేసుకుంది.

  • Written By:
  • Publish Date - October 14, 2022 / 05:34 AM IST

బాలీవుడ్ బ్యూటీ కత్రీనాకైఫ్…తన భర్తతో కలిసి మొదటిసారిగా కర్వాచౌత్ లో పాల్గొన్నది. కత్రినా ఈ పండుగను తన అత్తగారింట్లో ఘనంగా సెలబ్రేట్ చేసుకుంది. కత్రినా తన వివాహం తర్వాత వచ్చిన మొదటి కర్వా చౌత్ ఇదే. కర్వా చౌత్ కు సంబందించిన ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది.తల పాపిట్లో కుంకుమ, నుదుట ఎర్రటి బొట్టు, చేతులకు ఎర్రటి గాజులు, జరీ వర్క్ తో ఉన్న గులాబీ కలర్ చీరను ధరించిన కత్రీనా..అచ్చం లక్ష్మీదేవిలా కనిపించింది. మెడలో మంగళసూత్రం, చెవిపోగులు, తన ఎంగేజ్ మెంట్ విక్కీ గిఫ్ట్ గా ఇచ్చిన ఉంగారాన్ని ధరించింది. కత్రీనా కర్వాచౌత్ ఆచారాన్నీ పక్కగా పాటించింది. వీరిద్దరి జోడీ పై నెటిజన్లు సంతోషంగా కామెంట్స్ చేస్తున్నారు.

ప్రతిఏడాది మీరు ఇలాగే అత్తగారింట్లోకర్వా చౌత్ జరుపుకోవాలంటూ అభిమానులు కామెంట్లు చేస్తున్నారు. రెడ్ హార్ట్ ఫైర్ ఎమోజీలను షేర్ చేస్తూ తమ అభిమానాన్ని తెలుపుతున్నారు.