Site icon HashtagU Telugu

Katrina Kaif: ఎంత ‘ఘాటు’ ప్రేమాయో.. కత్రినా!

Katrina

Katrina

బాలీవుడ్ బ్యూటీ కత్రినా కైఫ్, తన భర్త  విక్కీ కౌశల్‌తో మ్యారేజ్ లైఫ్ ను ఎంజాయ్ చేస్తోంది. కొత్తగా పెళ్లయిన జంట ప్రేమలో తడిసిముద్దవుతోంది. ప్రేమ కౌగిల్లో తన్మయత్వం పొందుతోంది. తామిద్దరి మధ్య ఎలాంటి బాండింగ్ ఉంటుందో చెప్పకనే చెబుతున్నారు. ఒకొరినొకరు ముద్దులు పెట్టుకుంటూ, కౌగిలించుకుంటూ ఫొటోలకు ఫోజులిస్తున్నారు. ఏమాత్రం సిగ్గుపడకుండా బహిరంగంగానే చుంబించుకుంటున్నారు. హాట్ హాట్ ఫొటోలను సోషల్ మీడియాలో సైతం షేర్ చేసుకోవడానికి వెనుకాడటం లేదు. తాజాగా ఈ జంట సమ్మర్ హీట్ ను బీట్ చేసేందుకు స్విమ్మింగ్ పూల్ జలకలాడుతూ ఫొటోలకు ఫొజులిచ్చారు. తన హబ్బీని ముద్దాడుతూ హోయలు ఒలకబోస్తోంది. కత్రినా కైఫ్, విక్కీ కౌశల్ డిసెంబర్ 9, 2021న రహస్యంగా వివాహం చేసుకున్నారు. అయినప్పటికీ, అధికారికంగా మార్చి 19, 2022న మరోసారి పెళ్లిపీటలెక్కారు.

38 ఏళ్ల వయసులో కూడా కత్రినా తరగని అందంతో బాలీవుడ్ లో క్రేజీ హీరోయిన్ గా దూసుకుపోతోంది. ప్రస్తుతం కత్రినా సల్మాన్ ఖాన్ సరసన టైగర్ 3 మూవీలో నటిస్తోంది. గతంలో కత్రినా రొమాంటిక్ హీరో రణబీర్ కపూర్ తో డేటింగ్ చేసిన సంగతి తెలిసిందే. ఇది సీక్రెట్ ఏమీ కాదు. ఇక కేరీర్ విషయానికొస్తే కత్రినా కైఫ్ ప్రస్తుత బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ (Salman Khan)తో కలిసి టైగర్ 3 (Tiger 3) చిత్రంలో నటిస్తోంది. ఈ చిత్రం నుంచి ఇటీవల రిలీజ్ అయిన గ్లింప్స్ ఆకట్టుకుంటోంది. టైగర్ 3 సినిమా వచ్చే ఏడాది రిలీజ్ కానుంది.