Site icon HashtagU Telugu

Katrina-Deepika: కొత్త జంటకు కత్రినా, దీపికా ఏం చెప్పారో తెలుసా..!!

katrina kaif deepika

katrina kaif deepika

బాలీవుడ్ ప్రేమ పక్షులు రణబీర్ కపూర్-ఆలియా భట్ లు వివాహ బంధంతో ఏకమయ్యారు. గురువారం వీరిద్దరి పెళ్లి ఘనంగా జరిగింది. ఏడడుగులు వేసి…అధికారికంగా భార్యభర్తలు అయ్యారు. బంధువులు, అత్యంత సన్నిహితుల సమక్షంలో వీరి వివాహం జరిగింది. రణబీర్ ఇళ్లు బాంద్రాలోని వాస్తులో వీరి పెళ్లి జరిగింది. మొత్తానికి ఎప్పుడెప్పుడా అని ఎదురుచూసిన వీరి అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇక కొత్త జంటకు పలువురు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.

రణబీర్ కపూర్ కు తన మాజీ ప్రియురాల్లు కత్రినా కైఫ్, దీపికా పదుకునే కొత్త జంటకు శుభాకాంక్షలు తెలిపారు. రణబీర్ తో డేటింగ్ చేసిన దీపకా పదుకునే…రణ్ వీర్ సింగ్ ను వివాహం చేసుకుంది. అయినప్పటికీ అలియా భట్ తో ఆమెకు మంచి సన్నిహిత సంబంధం ఉంది. మీ ఇద్దరు కూడా జీవితంగా ప్రేమ, కాంతి, నవ్వుతో ఉండాలని కోరకుంటున్నాని తన ఇన్ స్టాలో పోస్టు చేసింది. ఇక కత్రినా కైఫ్…కొత్త జంటకు పెళ్లిరోజూ శుభాకాంక్షలు , సంతోషంగా ఉండంటి అంటూ తన ఇన్ స్టాగ్రామ్ లో పోస్టు చేసింది. అటు పెళ్లికి హాజరైన కరణ్ జోహార్ ఈ జంటకు శుభాకాంక్షలు తెలిపాడు. ఇలాంటి రోజు కోసం మనం జీవిస్తాము..కుటుంబం, ప్రమే, సంపూర్ణ భావోద్వేగాల అత్యంత అందమైన సమ్మేళనం…నా హృదయం ప్రేమతో పొంగిపోయి నిండిపోయింది అంటూ రాశాడు.

పెళ్లి పూర్తయ్యే వరకు కొత్త జంట ఆలియా-రణబీర్ ల పెళ్లి ఫొటోలు బయటికి రాలేదు. చాలా గోప్యంగా వివాహ వేడుకలకు ఏర్పాటు చేసింది కపూర్ భట్ కుటుంబం. అయితే అభిమానుల కోసం ఆలియా ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది. గత ఐదు సంవత్సరాలుగా మేము ఏ బాల్కనీలో అయితే ప్రేమించుకున్నామో…అక్కడే మా పెళ్లి జరగడం చాలా సంతోషంగా ఉందని ట్వీట్ చేసింది.

Exit mobile version