Site icon HashtagU Telugu

Katrina : తల్లికాబోతున్నట్లు ప్రకటించిన కత్రినా కైఫ్

Katrina Kaif And Vicky Kaus

Katrina Kaif And Vicky Kaus

బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కత్రినా కైఫ్ (Katrina Kaif) తల్లి కాబోతున్న శుభవార్తను అభిమానులతో పంచుకున్నారు. ఆమె భర్త, నటుడు విక్కీ కౌశల్తో(Vicky Kaushal) కలిసి ఇన్‌స్టాగ్రామ్‌లో బేబీ బంప్‌తో ఉన్న ఫొటోను షేర్ చేస్తూ “మా జీవితాల్లో బెస్ట్ ఛాప్టర్ ప్రారంభం అవుతోంది” అని పేర్కొన్నారు. ఈ పోస్టు వెలువడిన వెంటనే సోషల్ మీడియా మొత్తం శుభాకాంక్షల సందేశాలతో నిండిపోయింది. అభిమానులతో పాటు సినీ పరిశ్రమలోని ప్రముఖులు కూడా జంటను అభినందిస్తున్నారు.

Causes of Dizziness: తల తిరగడం కారణాలు ఏమిటి? అగస్మాత్తుగా తల తిప్పడం ఏ వ్యాధి సూచిక?

కత్రినా, విక్కీ కౌశల్ 2021లో రాజస్థాన్‌లో ఘనంగా వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. ఆ తర్వాత వీరిద్దరూ బాలీవుడ్‌లో అత్యంత పాపులర్ కపుల్స్‌గా నిలిచారు. తమ వ్యక్తిగత జీవితాన్ని గోప్యంగా ఉంచేందుకు ప్రయత్నించినప్పటికీ, అభిమానులు ఎప్పుడూ వీరిపై ఆసక్తి చూపుతూనే ఉన్నారు. ఇప్పుడు మాతృత్వం అనే కొత్త అధ్యాయం ప్రారంభించబోతున్న ఈ జంట జీవితాల్లో కొత్త వెలుగును తీసుకువచ్చింది.

సోషల్ మీడియాలో ఫ్యాన్స్ ఆనందాన్ని వ్యక్తం చేస్తూ “ఇది మీ జీవితంలో అత్యంత అందమైన దశ” అని కామెంట్లు చేస్తున్నారు. పలువురు బాలీవుడ్ స్టార్లు కూడా శుభాకాంక్షలు తెలుపుతూ, ఈ కొత్త ప్రయాణానికి తమ ఆశీస్సులు అందించారు. కత్రినా కైఫ్, విక్కీ కౌశల్ దంపతులు తమ కుటుంబంలోకి కొత్త సభ్యుడిని ఆహ్వానించబోతున్న ఈ సందర్భం బాలీవుడ్ అభిమానులకు పండుగ వాతావరణాన్ని తీసుకొచ్చింది.

Exit mobile version