Site icon HashtagU Telugu

Asian Google Beauties: అలియా, దీపికాను బీట్ చేసిన కత్రినా.. ఏషియన్ గూగుల్ సెర్చ్ లో టాప్ ప్లేస్!

Google Beauties katrina

Google Beauties

గూగుల్ (Google) విడుదల చేసిన ‘మోస్ట్ సెర్చ్డ్ ఏషియన్ వరల్డ్‌వైడ్ 2022’ జాబితాలో బాలీవుడ్ నటి కత్రినా కైఫ్‌ (Katrina kaif) కు చోటు దక్కింది. ఈ సంవత్సరం గూగుల్‌లో అత్యధికంగా సెర్చ్ చేసిన ఆసియన్ల జాబితాలో కత్రినా 4వ స్థానాన్ని పొందింది. అలియా భట్ 5వ స్థానంలో ఉంది. ఈ ఏడాది జాబితాలో భారతీయ నటీనటులలో కత్రినా (Katrina Kaif) అగ్రస్థానంలో నిలిచింది.

భారతీయ క్రికెటర్ విరాట్ కోహ్లీ అత్యధికంగా సెర్చ్ చేసినా ఆసియా 2022 జాబితాలో మూడవ స్థానాన్ని పొందాడు. దక్షిణ కొరియా బ్యాండ్ BTS సభ్యులు Taehyung, Jungkook ఒకటి, రెండు స్థానాల్లో ఉన్నారు. కత్రినా ‘ఏక్ థా టైగర్’, ‘టైగర్ జిందా హై’, ‘ధూమ్ 3’, ‘జబ్ తక్ హై జాన్’, ‘జిందగీ నా మిలేగీ దొబారా’ వంటి పెద్ద బాలీవుడ్ చిత్రాలలో పనిచేసింది. కత్రినా డిసెంబర్ 10, 2021న నటుడు విక్కీ కౌశల్‌తో వివాహం చేసుకుంది. ఈ జంట సోషల్ మీడియాలో ఒకరిపై ఒకరు ప్రేమను కురిపిస్తూ ప్రత్యేకార్షణగా నిలుస్తున్నారు.

కత్రినా ఇటీవల సిద్ధాంత్ చతుర్వేది, ఇషాన్ ఖట్టర్‌లతో కలిసి హర్రర్ కామెడీ చిత్రం ‘ఫోన్ భూత్’లో కనిపించింది. దీనికి ప్రేక్షకుల నుండి మంచి స్పందన వచ్చింది. ఆమె తదుపరి ఆదిత్య చోప్రా రాబోయే యాక్షన్ థ్రిల్లర్ చిత్రం ‘టైగర్ 3’లో సల్మాన్ ఖాన్‌తో కలిసి నటిస్తోంది. ఇది దీపావళి 2023 సందర్భంగా థియేటర్లలోకి రానుంది. అంతే కాకుండా.. సౌత్ స్టార్ విజయ్ సేతుపతికి జోడీగా శ్రీరామ్ రాఘవన్ రాబోయే చిత్రం ‘మెర్రీ క్రిస్మస్’ లో కనిపించబోతోంది. ఫర్హాన్ అక్తర్ రాబోయే చిత్రం ‘జీ లే జరా’తో పాటు అలియా భట్, ప్రియాంక చోప్రా కూడా ఉంది.