Site icon HashtagU Telugu

Anasuya: అనసూయ పై కస్తూరి కామెంట్స్ వైరల్ !

Anasuya

Kasturi's Comments On Anasuya Are Going Viral!

మా టీవీలో ప్రసారమయ్యే ‘గృహలక్ష్మి’ (Gruhalakshmi) సీరియల్ ద్వారా బుల్లితెర ప్రేక్షకులకు అత్యంత చేరువైన నటి కస్తూరి (Kasturi). ఇందులో ఆమె పోషిస్తున్న తులసి క్యారెక్టర్‌కు బాగానే పేరొచ్చింది. నిజానికి చాలా ఏళ్ల కిందట కమల్ హాసన్ ‘భారతీయుడు’, నాగార్జున ‘అన్నమయ్య’ చిత్రాల్లో హీరోయిన్‌గా నటించిన కస్తూరి.. ఆ తర్వాత అమెరికా వెళ్లిపోయింది. అయితే సెకండ్ ఇన్నింగ్స్‌లో బుల్లితెరపై రాణిస్తున్న ఈ సీనియర్ హీరోయిన్‌ సోషల్ ఇష్యూస్‌పై గొంతు వినిపించడంలో ముందుంటుంది. ఈ క్రమంలోనే ఆమె చేసిన కామెంట్స్ కొన్నిసార్లు కాంట్రవర్సీకి కూడా దారితీస్తుంటాయి. ఇదిలా ఉంటే, తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆమె.. జూనియర్ ఎన్టీఆర్ అమెరికన్ యాక్సెంట్‌పై జరిగిన ట్రోలింగ్‌తో పాటు జబర్దస్త్ యాంకర్ అనసూయపై (Anchor Anasuya) జరిగిన ‘ఆంటీ’ ట్రోల్స్‌పై (Aunty Trolls) స్పందించింది.

యాంకర్ అనసూయను ‘ఆంటీ’ అని పిలవడంపై నెట్టింట జరుగుతున్న వివాదం గురించి కస్తూరి మాట్లాడింది. ‘ఒక చిన్న పాప వచ్చి పిలవడానికి, దున్నపోతులా ఉన్న వ్యక్తి వచ్చి ఆంటీ అని పిలవడానికి చాలా తేడా ఉంది. చిన్నపిల్లలు కాకుండా పెద్దవారు ఎవరైనా ఒక మహిళను ఆంటీ అని పిలిచేందుకు హక్కులేదు. వయసుతో సంబంధం లేకుండా ఏ మహిళనైనా ఆంటీ అని పిలవడం చిన్న పిల్లలకే కరెక్ట్. అడల్ట్ ఎవరైనా అలా పిలిచారంటే అది ఖచ్చితంగా అగౌరవపరచడమే. ఒక హీరో లేదా నటుడి దగ్గరికెళ్లి అంకుల్ అని పిలుస్తారా? నిజానికి ‘ఆంటీ’ అనే పదానికి ప్రస్తుతం డర్టీ మీనింగ్ కూడా వచ్చేసింది. కానీ అంకుల్ అనే పదంలో అదేం లేదు. అనసూయ (Anasuya) కన్నా రెట్టింపు వయసున్న హీరోలున్నారు. వాళ్లను అంకుల్ అని పిలవగలరా? ముమ్మాటికి ఈ విషయంలో నేను అనసూయకు సపోర్ట్ చేస్తా’ అని చెప్పింది.

‘ఎలా పిలవాలో తెలియకపోతే మేడమ్ అనండి.. సిస్టర్ లేదా అమ్మా అని పిలవండి. అదీ కాదంటే గారు అని సంబోధించండి’ అని తన అభిప్రాయాన్ని వెల్లడించింది. అయితే నెటిజన్లు రెచ్చగొట్టాలని చూస్తున్నప్పుడు ఇష్యూకు ఫుల్‌స్టాప్ పెట్టకుండా, మొండిగా వాదిస్తూ పెద్దదిగా చేయడంపై చాలా మంది అనసూయను విమర్శిస్తున్నారన్న ప్రశ్నకు కస్తూరి తన వెర్షన్ చెప్పుకొచ్చింది. ‘ఇన్‌స్టా చాటింగ్‌లో అభిమానులు తమతో కాస్త లైన్ క్రాస్ చేసే కామెంట్లకు చాలాసార్లు హ్యూమరస్‌గా ఆన్సర్ ఇచ్చేందుకు ప్రయత్నిస్తాను. అయినప్పటికీ కొందరు శ్రుతి మించి చేస్తే అలాంటి యూజర్లను బ్లాక్ చేస్తాను. ఇంతకన్నా వేరే మార్గం లేదు’ అని సూచించింది.

ఇదే ఇంటర్వ్యూలో.. గోల్డెన్ గ్లోబ్ అవార్డ్స్ ఈవెంట్‌ సందర్భంగా ఎన్టీఆర్ మాట్లాడిన అమెరికన్ యాక్సెంట్‌పై జరిగిన ట్రోల్స్‌పైనా రియాక్ట్ అయిన కస్తూరి.. తను చాలా బాగా మాట్లాడాడని, అక్కడ అలా మాట్లాడితేనే కరెక్ట్ అని సపోర్ట్ చేసింది. అలాగని అమెరికన్ యాక్సెంట్‌ను హైదరాబాద్‌లో ట్రై చేయకూడదని చెప్పింది. పైగా మంచు లక్ష్మి వంటి వారు తెలుగును కూడా అమెరికన్ యాక్సెంట్‌లో మాట్లాడటమంటే ఓవర్ చేయడమేనంటూ తన అభిప్రాయాలను పంచుకుంది.

Also Read:  Bandla Ganesh: ఏపీ సీఎం కు బండ్ల గణేష్ రిక్వెస్ట్..!