Kashmir Files Controversy: కాంట్రావర్సీలో ‘కాశ్మీర్ ఫైల్స్’, దుమారం రేపుతున్న ‘నాదవ్ లిపిద్’ వ్యాఖ్యలు

విడుదలైన నాటి నుంచి నేటి వరకు ‘ది కాశ్మీర్ ఫైల్స్’ ఏదో ఒక సందర్భంలో వివాదం నెలకొంటూనే ఉంది. ఈ సినిమా విడుదలై నెలలు

  • Written By:
  • Updated On - November 29, 2022 / 01:25 PM IST

విడుదలైన నాటి నుంచి నేటి వరకు ‘ది కాశ్మీర్ ఫైల్స్’ ఏదో ఒక సందర్భంలో వివాదం నెలకొంటూనే ఉంది. ఈ సినిమా విడుదలై నెలలు గడుస్తున్నా వివాదాలకు మాత్రం ఫుల్ స్టాప్ పట్టడం లేదు. తాజాగా ఇండియన్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌ ఆఫ్‌ ఇండియా (ఇఫ్ఫీ) ఫెస్టివల్‌లో జ్యూరీ హెడ్‌ నాదవ్‌ లిపిద్‌ ఈ మూవీపై సంచలన వ్యాఖ్యలు చేసి మరో వివాదానికి తెర లేపారు. ‘‘కాశ్మీర్‌ ఫైల్స్‌ ఒక వల్గర్‌, 53వ ఇఫ్ఫీ ఫిల్మ్‌ ఫెస్టివల్‌లో ఉండాల్సిన సినిమా కాదు. ఆర్టిస్టిక్‌ కేటగిరిలో అలాంటి సినిమా చూసి షాక్‌ అయ్యాం.’ అని ఆయన మాట్లాడారు.

ఇజ్రాయిల్‌ స్క్రీన్‌ రైటర్‌ అయిన నాదవ్‌ ఈ ఫెస్టివల్‌లో.. ఇండియన్‌ మినిస్టర్స్‌, సినీ సెలబ్రిటీస్‌ ముందు బహిరంగంగా కాశ్మీర్‌ ఫైల్స్‌ పై మాట్లాడడం ఇప్పుడు హాట్‌ టాపిక్‌గా మారింది. కాగా, నాదవ్‌ లిప్‌ వ్యాఖ్యలపై ఈ సినిమాలో నటించిన అనుపమఖేర్‌ స్పందించారు. ‘అబద్ధం నిజం ముందు అది చాలా చిన్నగానే ఉంటుంది’ అని ట్వీట్‌ చేశాడు. కాగా ఇదే వివాదంపై శివసేన ఎంపీ సంజయ్ రౌత్ సైతం స్పందించారు. ‘కాశ్మీర్‌లో అత్యధిక హత్యలు ఈ సినిమా తర్వాతే జరిగాయి’ అని అన్నారు. ప్రస్తుతం నాదవ్ లిపిద్ కామెంట్స్ దేశవ్యాప్తంగా చర్చనీయాంశమవుతుండటంతో ఎట్టకేలకు క్షమాపణలు చెప్పాల్సి వచ్చింది.

“ది కాశ్మీర్ ఫైల్స్”కి వ్యతిరేకంగా నాదవ్ లాపిడ్ IFFI గోవాలో న్యాయమూర్తుల ప్యానెల్‌కు అధ్యక్షత వహించడానికి భారతదేశ ఆహ్వానాన్ని దుర్వినియోగం చేశారని, అతనిపై ఉన్న నమ్మకం పోయిందని ఇండియన్ సినీ క్రిటిక్స్ మండిపడుతున్నారు. ఈ కొత్త వివాదంపై కాశ్మీర్ ఫైల్స్ దర్శకుడు మాత్రం రియాక్ట్ అవ్వలేదు.  ఈ చిత్రాన్ని 15 కోట్లతో నిర్మిస్తే.. రూ. 340 కోట్లను వసూలు చేసిన విషయం తెలిసిందే.