Site icon HashtagU Telugu

Prabhas – Kartikeya : ప్రభాస్ ‘ఎక్స్’తో ఉంటున్నా అంటున్న హీరో కార్తికేయ..

Kartikeya Gummakonda Said He Stay With Prabhas X

Kartikeya Gummakonda Said He Stay With Prabhas X

Prabhas – Kartikeya : టాలీవుడ్ టాలెంటెడ్ హీరో కార్తికేయ.. ప్రస్తుతం ప్రభాస్ ‘ఎక్స్’తో ట్రావెల్ అవుతున్నా అంటున్నారు. అదేంటి కార్తికేయ ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు కదా, మరి ప్రభాస్ ఎక్స్ తో ఉండడం ఏంటి..? అని ఆలోచిస్తున్నారా. ఇక్కడే ఒక ట్విస్ట్ ఉంది. కార్తికేయ, ప్రభాస్ ఎక్స్ తోనే ఉంటున్నారు. కానీ ఆ ఎక్స్ అమ్మాయి కాదు, ఒక కారు.

అవును ఒకప్పుడు ప్రభాస్ ఉపయోగించిన కారుని ప్రస్తుతం కార్తికేయ ఉపయోగిస్తున్నారు. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా తెలియజేసారు. కార్తికేయ నటించిన కొత్త సినిమా ‘భజే వాయు వేగం’ ఈ వారం రిలీజ్ కాబోతుంది. ఇక ఈ మూవీ ప్రమోషన్స్ లో ఉన్న కార్తికేయ.. క్రేజీ ఇంటర్వ్యూలతో ఆడియన్స్ ని ఆకట్టుకుంటున్నారు. ఈక్రమంలోనే రీసెంట్ గా తన కారులో ట్రావెల్ చేస్తూ ఒక ఇంటర్వ్యూ ఇచ్చారు.

ఈ ఇంటర్వ్యూలో కార్తికేయ మాట్లాడుతూ.. “ఈ కారుకి ఒక ఆసక్తికరమైన గతం ఉంది. ఈ కారుని ఒకప్పుడు ప్రభాస్ గారు ఉపయోగించుకున్నారు. ఆయన దగ్గర నుంచి నేను కొనుగోలు చేసి, ఇప్పుడు నేను వాడుతున్నాను. చెప్పడానికి ఇది ప్రభాస్ గారి ఎక్స్ కారు” అంటూ చెప్పుకొచ్చారు. దీంతో ప్రస్తుతం ఈ వీడియో బిట్ నెట్టింట వైరల్ గా మారింది. కాగా ఈ కారు మోడల్ వచ్చి ‘జాగ్వార్’.

ఇక ‘భజే వాయు వేగం’ సినిమా విషయానికి వస్తే.. యూవీ కాన్సెప్ట్స్ నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని ప్రశాంత్ రెడ్డి చంద్రపు డైరెక్ట్ చేస్తున్నారు. ఐశ్వర్య మీనన్ ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తున్నారు. ఇప్పటికే రిలీజైన టీజర్ అండ్ ట్రైలర్ ఆడియన్స్ ని బాగా ఆకట్టుకున్నాయి. మే 31న ఈ సినిమా రిలీజ్ కాబోతుంది. ఇటీవలే ‘బెదురులంక 2012’ అందుకున్న కార్తికేయ.. మరి ఈ సినిమాతో కూడా హిట్ కొడతారేమో చూడాలి.