Kartikeya Gummakonda : సల్మాన్ ఖాన్‌కి విలన్‌గా కార్తికేయ నటించబోతున్నాడా..?

సల్మాన్ ఖాన్‌కి విలన్‌గా టాలీవుడ్ టాలెంటెడ్ హీరో కార్తికేయ నటించబోతున్నాడా..?

  • Written By:
  • Publish Date - May 25, 2024 / 03:50 PM IST

Kartikeya Gummakonda : టాలీవుడ్ టాలెంటెడ్ యాక్టర్ కార్తికేయ ఒక పక్క హీరోగా నటిస్తూనే.. మరో హీరో సినిమాలో విలన్ గా కూడా కనిపించి మెప్పిస్తున్నారు. నాని ‘గ్యాంగ్ లీడర్’లో విలన్ గా ఆకట్టుకున్న కార్తికేయకు.. తమిళ ఇండస్ట్రీ నుంచి ఒక బంపర్ ఆఫర్ అందుకున్నారు. అక్కడి స్టార్ హీరో అజిత్ నటిస్తున్న ‘వలిమై’ సినిమాలో విలన్ గా నటించే అవకాశాన్ని అందుకున్నారు. అజిత్ తో పోటాపోటీగా కనిపించే ఆ పాత్రని కార్తికేయ చేసి ప్రశంసలు అందుకున్నారు.

దీంతో ఇప్పుడు బాలీవుడ్ నుంచి కూడా కార్తికేయకి ఆఫర్ వచ్చినట్లు తెలుస్తుంది. అది కూడా బాలీవుడ్ మెగాస్టార్ సల్మాన్ ఖాన్ సినిమాలో పాత్ర కోసం అని సమాచారం. తమిళ్ స్టార్ డైరెక్టర్ మురుగదాస్ తో సల్మాన్ ఖాన్ తన నెక్స్ట్ సినిమాని చేయబోతున్న సంగతి తెలిసిందే. ‘సికందర్’ అనే టైటిల్ ని ఫిక్స్ చేసుకున్న ఆ మూవీ ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ జరుపుకుంటుంది. జూన్ నెలలో ఈ మూవీని లాంచ్ చేసి.. రెగ్యులర్ షూటింగ్ మొదలు పెట్టనున్నారట.

ప్రస్తుతం ఈ మూవీ లొకేషన్స్ మరియు పాత్రల కోసం నటీనటుల ఎంపిక జరుగుతుంది. కాగా ఈ మూవీలో ముగ్గురు విలన్స్ కనిపించనున్నారట. ఈ మూడు పాత్రలు చాలా పవర్ ఫుల్ గా కనిపించనున్నాయట. ఇక ఆ ముఖ్యమైన మూడు విలన్ పాత్రల కోసం కార్తికేయ, అరవింద్ స్వామి, ప్రకాష్ రాజ్ ని ఎంపిక చేసుకున్నారట. అయితే మూవీ టీం నుంచి ఈ విషయం పై క్లారిటీ రావాల్సి ఉంది.

ఒకవేళ ఇది నిజమైతే.. కార్తికేయ మంచి అవకాశం అందుకున్నట్లే అని చెప్పొచ్చు. ప్రస్తుతం పాన్ ఇండియా మార్కెట్ అలవాటు అవుతున్న సమయంలో.. కార్తికేయ మార్కెట్ కి ఇది ఉపయోగపడొచ్చు. కాగా కార్తికేయ ప్రస్తుతం ‘భజే వాయు వేగం’ సినిమాతో ఆడియన్స్ ని పలకరించేందుకు సిద్ధంగా ఉన్నారు. ఈ మూవీ మే 31న రిలీజ్ కాబోతుంది.