Allu arjun Vs Kartik Aaryan: ఇక్కడ హిట్టు.. అక్కడ ఫట్టు.. బన్నీ గ్రేస్ కు కార్తీక్ ఔట్!

తాజాగా బాలీవుడ్ లో షెహజాదా రిలీజయ్యింది. అల్లు అర్జున్ స్థానంలో కార్తీక్ ఆర్యన్ చేరగా పూజా హెగ్డే పాత్రలో కృతి సనన్ వచ్చింది.

Published By: HashtagU Telugu Desk
Alavaikuntapuram

Alavaikuntapuram

టాలీవుడ్ లో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచిన అల వైకుంఠపురములో సినిమాకు నేటికీ ఫుల్ క్రేజ్.. ఆ సినిమాలోని పాటలు, బన్నీ నటన ఓ హైలైట్. మెగాస్టార్ చిరంజీవి ‘వాల్తేరు వీరయ్య’ మూవీ ఎంత గట్టిగా ప్రయత్నిస్తున్నా చాలా కేంద్రాల్లో దగ్గరగా వెళ్ళిందే తప్ప ఓవర్ టేక్ చేయలేకపోయింది. ఒక ఫ్యామిలీ ఎంటర్ టైనర్ ని ఇండస్ట్రీ హిట్ సాధించే స్థాయిలో మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ తీర్చిదిద్దిన తీరు ఎవర్ గ్రీన్ క్లాసిక్ గా మార్చేసింది. టీవీలో వచ్చినా ఓటిటిలో చూసినా ఈ మూవీకున్నంత రిపీట్ వేల్యూ ఈ మధ్య కాలంలో దేనికీ లేదన్నది వాస్తవం. సహజంగానే దీని రీమేకులు జరుగుతాయి

తాజాగా బాలీవుడ్ లో షెహజాదా రిలీజయ్యింది. అల్లు అర్జున్ స్థానంలో కార్తీక్ ఆర్యన్ చేరగా పూజా హెగ్డే పాత్రలో కృతి సనన్ వచ్చింది. ఉదయం షోలు పూర్తవ్వడం ఆలస్యం దీనికి ఆశించిన స్థాయిలో టాక్ రాలేదు. క్రిటిక్స్ అయితే బాలేదంటూ తీర్పులిచ్చేశారు. బన్నీ గ్రేస్ ని కార్తీక్ క్యారీ చేయలేకపోయాడు. మార్పులు చేయకుండా యధాతథంగా తీసే క్రమంలో దర్శకుడు రోహిత్ ధావన్ తడబడటంతో ఒరిజినల్ వెర్షన్ చూడని వాళ్ళను సైతం మెప్పించేలా లేకపోయింది.

పరేష్ రావల్, మనీషా కొయిరాలా, కెకె మీనన్ లాంటి సూపర్ క్యాస్టింగ్ ఉన్నా వాళ్ళను బ్యాడ్ రైటింగ్ తో వృధా చేసుకున్నారు. ఇక అల వైకుంఠపురములో చూసినవాళ్లు మాత్రం షెహజాదాకు దూరంగా ఉంటే బెటర్. నిజానికి అల వైకుంఠపురములో గొప్ప కథేమీ కాదు. ఎప్పుడో వచ్చిన ఇంటిగుట్టు లాంటి వాటిలో ఈ తరహా కథలు వచ్చాయి. కానీ త్రివిక్రమ్ మార్కు టేకింగ్ ప్లస్ సంభాషణలు ఎక్కడికో తీసుకెళ్లి కూర్చోబెట్టాయి. కానీ బాలీవుడ్ మూవీ మాత్రం ఆ స్థాయికి చేరుకోలేకపోయాయి.

  Last Updated: 18 Feb 2023, 04:21 PM IST