Site icon HashtagU Telugu

Sreeleela : ఆ హీరోతో శ్రీలీల భలేగా దొరికిందే..!!

Karthik Aryan Srileela

Karthik Aryan Srileela

పెళ్లి సందD సినిమాతో తెలుగు ప్రేక్షకుల మనసుల్లో నిలిచిన శ్రీలీల, ఆ తర్వాత వెనుదిరిగి చూసే అవసరం లేకుండా స్టార్ హీరోయిన్‌గా ఎదిగింది. రవితేజతో నటించిన ధమాకా ఘన విజయాన్ని సాధించడంతో ఆమెకు వరుస అవకాశాలు దక్కాయి. స్కంద, గుంటూరు కారం, భగవంత్ కేసరి వంటి చిత్రాల్లో నటించిన ఈ భామ..ప్రస్తుతం పవన్ కళ్యాణ్, విజయ్ దేవరకొండ సినిమాల్లోనూ నటించబోతుంది.

Donald Trump : బ్రిక్స్ దేశాలపై ట్రంప్ సంచలన వ్యాఖ్యలు

తెలుగులో పాపులారిటీ సంపాదించుకున్న శ్రీలీల (Sreeleela ) ఇప్పుడు బాలీవుడ్‌లోకి అడుగుపెడుతోంది. సైఫ్ అలీఖాన్ కుమారుడు ఇబ్రహిం ఖాన్ నటిస్తున్న దిలర్ సినిమాలో ఆమె హీరోయిన్‌గా ఎంపికయ్యింది. అంతేకాకుండా యంగ్ హీరో కార్తీక్ ఆర్యన్‌(Karthik Aryan)తో కలిసి ఆమె ఆషికీ 3 సినిమాలో కూడా నటిస్తోంది. ఇటీవల ఈ సినిమా టీజర్‌లో వారి లిప్ లాక్ సీన్ చర్చనీయాంశంగా మారింది. దీంతో ఈ జంట ప్రేమలో ఉన్నారనే వార్తలు హల్‌చల్ చేస్తున్నాయి. ముంబైలో ఎక్కువగా కనిపిస్తున్న శ్రీలీల ఇటీవల కార్తీక్ ఇంట్లో జరిగిన ఫంక్షన్‌కు హాజరవ్వడం ఈ ఊహాగానాలకు మరింత బలమిచ్చింది.

కార్తీక్ ఆర్యన్ తల్లి “మా అబ్బాయికి డాక్టర్ కోడలు కావాలి” అని ఆ మధ్య చేసిన వ్యాఖ్యలు కూడా సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయ్యాయి. శ్రీలీల మెడికల్ విద్యార్థినిగా ఉన్న విషయం తెలిసిందే. దీంతో నెటిజన్లు వీరిద్దరూ డేటింగ్‌లో ఉన్నారని ఫిక్స్ అయిపోయారు. వీరిద్దరి సెల్ఫీలు, రెస్టారెంట్‌ ఫొటోలు వైరల్ అవుతుండగా, బాలీవుడ్‌ వర్గాల్లో వీరి సంబంధంపై గాసిప్స్ జోరుగా చర్చించుకుంటున్నారు. అయితే ఈ విషయంపై శ్రీలీల ఎలా రియాక్ట్ అవుతుందో చూడాలి.