టాలీవుడ్ యువ హీరో కార్తికేయ(Karthikeya).. ‘ఆర్‌ఎక్స్ 100′(RX 100) సినిమాతో ఓవర్ నైట్ స్టార్ అయ్యిపోయారు. అజయ్ భూపతి(Ajay Bhupathi) దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో పాయల్ రాజ్‌పూత్ (Payal Rajput) హీరోయిన్ గా నటించారు. ఈ సినిమా ఈ ముగ్గురు కెరీర్ కి మంచి బూస్ట్ అయ్యింది. అసలు ఈ సినిమా ఎలా మొదలైంది..? ఈ ప్రాజెక్ట్ లోకి కార్తికేయ, పాయల్ ఎలా ఎంట్రీ ఇచ్చారు..తెలుసా?
అజయ్ భూపతి రామ్ గోపాల్ వర్మ దగ్గర శిష్యరికం చేస్తున్న సమయంలో ఈ సినిమా కథ పుట్టింది. తన జీవితంలో ఎదురైన కొన్ని యదార్థ సంఘటనలను ఆధారంగా చేసుకొని ఈ సినిమా కథని రాశారు అజయ్. ఇక ఈ స్టోరీని ముందుగా విజయ్ దేవరకొండకు(Vijay Devarakonda) వినిపించారట. అప్పటికి విజయ్ ‘పెళ్లి చూపులు’ హిట్ కూడా అందుకోలేదు. కాగా విజయ్ ‘ఆర్‌ఎక్స్ 100’ స్టోరీకి నో చెప్పారట. అదేంటి అర్జున్ రెడ్డి వంటి సినిమా చేసిన విజయ్ ఈ మూవీకి నో చెప్పారా అని ఆలోచిస్తున్నారా.
ఈ సందేహాన్ని కూడా దర్శకుడు అజయ్ భూపతే సమాధానం ఇచ్చారు. విజయ్ దేవరకొండ సిటీలో పెరిగిన వ్యక్తి. ‘ఆర్‌ఎక్స్ 100’ విలేజ్ బ్యాక్ డ్రాప్ మూవీ. ఆ కారణంతోనే అతను నో చెప్పి ఉండొచ్చని అనుకున్నారట. ఇక విజయ్ తరువాత నవీన్ చంద్రకి కూడా ఈ కథ చెప్పాలని అనుకున్నారట. కానీ ఎందుకో అది కుదరలేదట. ఆ తరువాత అజయ్ ఒక విషయం అలోచించి.. హీరోలకు కాదు నిర్మాతలకు చెబుదామని నిర్ణయం తీసుకోని వారికి కథ చెప్పడం మొదలు పెట్టారు.
ఈ కథని విన్న నిర్మాతలు.. తెలుగు ప్రేక్షకులు ఇలాంటి కథలను చూడరేమో అని అనేవారట. ఇలా ప్రయత్నంలో ఉండగా కొత్త హీరో అయితే రిస్క్ ఉండదని కార్తికేయకు కథ వినిపించారు. ఈ సినిమాని కార్తికేయ ఫ్యామిలీనే నిర్మించింది. ఇక ఈ సినిమాలో కథానాయికగా తెలుగు హీరోయిన్ తీసుకోవాలని అజయ్ చాలా ప్రయత్నం చేశారట. కానీ హీరోయిన్ పాత్రకి నెగటివ్ ఛాయలు ఉండడంతో ప్రతి ఒక్కరు రిజెక్ట్ చేస్తూ వచ్చారు. దీంతో ఫైనల్ గా పాయల్ ని సంప్రదిస్తే ఆమె ఓకే చేశారు. దీంతో ‘ఆర్‌ఎక్స్ 100’ సినిమా పట్టాలెక్కింది. రిలీజయ్యాక ఈ సినిమా భారీ విజయం సాధించి కార్తికేయను హీరోగా నిలబెట్టింది.
Also Read : Akhil Akkineni: అక్కినేని అఖిల్ సినిమాల లైనప్