Site icon HashtagU Telugu

Karthikeya Baje Vayu Vegam : కార్తికేయ కరెక్ట్ రూట్ లోకి వచ్చాడా..?

Karthikeya Correct Route With Bhaje Vayu Vegam

Karthikeya Correct Route With Bhaje Vayu Vegam

Karthikeya Baje Vayu Vegam యువ హీరో కార్తికేయ లీడ్ రోల్ లో ప్రశాంత్ రెడ్డి డైరెక్షన్ లో వస్తున్న సినిమా భజే వాయు వేగం. ఈ నెల 31న రిలీజ్ అవుతున్న ఈ సినిమాతో కార్తికేయ మరో హిట్ తన ఖాతాలో వేసుకోవాలని చూస్తున్నాడు. లాస్ట్ ఇయర్ బెదురులంక 2012 తో హిట్ అందుకున్న కార్తికేయ భజే వాయు వేగం సినిమాతో ఆ హిట్ మేనియా కొనసాగించాలని చూస్తున్నాడు. భజే వాయు వేగం సినిమా ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ లో కార్తికేయ తన సినిమాల ప్లానింగ్ గురించి చెప్పాడు.

ప్రేమతో మీ కార్తీక్ సినిమాతో పరిచయమైన తనకు చిన్నప్పటి నుంచి సినిమాల మీద ఆసక్తి ఉందని అన్నాడు. అంతేకాదు చిన్నప్పుడే తాను హీరో అవ్వాలని అనుకున్నానని అన్నాడు. ఆరెక్స్ 100 హిట్ తో తనని అందరు గుర్తు పట్టడం జరిగిందని. ఆ టైం లో వరుస సినిమాలు చేశానని. ఒక ఏడాది మూడు సినిమాలు వచ్చాయని అన్నాడు. ఐతే ప్రతి యాక్టర్ కు ఒక టైం లో తన రూట్ తెలుస్తుందని.. తను ఎలాంటి సినిమా చేయాలని అనుకున్నానో అలాంటి కథే ప్రశాంత్ రెడ్డి చెప్పాడు.

భజే వాయు వేగం తప్పకుండా ప్రేక్షకులను అలరిస్తుందని అన్నారు. యంగ్ హీరోల్లో మంచి ఫిజిక్ ఉన్న కార్తికేయ స్టార్ హీరోకి కావాల్సిన క్వాలిటీస్ అన్ని ఉన్నాయి. కార్తికేయ భజే వాయు వేగం ట్రైలర్ ఆసక్తికరంగా ఉంది. సినిమాతో కార్తికేయ అనుకున్న సక్సెస్ అందుకుంటాడా లేదా అన్నది చూడాలి. కార్తికేయ భజే వాయు వేగం ట్రైలర్ చూస్తే అతను కరెక్ట్ రూట్ లోనే ఉన్నాడని అనిపిస్తుంది.

Also Read : Ram charan Vetrimaran : వెట్రిమారన్ కథ చరణ్ ఓకే చేశాడా..?