Site icon HashtagU Telugu

Karthika Nair : నిశ్చితార్థం చేసుకొని కాబోయే భర్తని పరిచయం చేసిన హీరోయిన్.. త్వరలోనే పెళ్లి..

Karthika Nair Shares her Engagement Pics and Introduce her Life Partner

Karthika Nair Shares her Engagement Pics and Introduce her Life Partner

తాజాగా ఓ హీరోయిన్ నిశ్చితార్థం చేసుకొని తనకు కాబోయే భర్తని పరిచయం చేసింది. సీనియర్ నటి రాధా(Radha) కూతురిగా జోష్ సినిమాతో సినీ పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చింది కార్తీక నాయర్(Karthika Nair). ఆ తర్వాత రంగం సినిమాతో పెద్ద హిట్ కొట్టింది కార్తీక. తెలుగు, తమిళ్, మలయాళంలో పలు సినిమాలు చేసిన కార్తీక నాయర్ 2015 నుంచి సినిమాలకు దూరమైంది.

ప్రస్తుతం దుబాయ్(Dubai) లో ఉంటూ తన ఫ్యామిలీకి ఉన్న హోటల్ బిజినెస్ లను చూసుకుంటుంది. ఇటీవల కొన్ని రోజుల క్రితమే ఓ అబ్బాయితో క్లోజ్ గా ఉన్న ఫోటో షేర్ చేసి ఎంగేజ్మెంట్ చేసుకున్నట్టు, పెళ్లి చేసుకోబోతున్నట్టు హింట్ ఇచ్చింది కార్తీక. ఆ ఫొటోలో అబ్బాయిని చూపించలేదు, ఎవరు అనేది చెప్పలేదు. తాజాగా కార్తీక నిశ్చితార్థం రోజున కాబోయే భర్తతో దిగిన ఫోటోలని తన సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఆ అబ్బాయి పేరు రోహిత్ మీనన్(Rohit Menon). అతను కూడా వ్యాపారవేత్త అని సమాచారం.

ఇక తనకు కాబోయే భర్తతో దిగిన రొమాంటిక్ ఫోటోలను షేర్ చేసిన కార్తీక.. నిన్ను కలవడం నా డెస్టినీ. నువ్వు కలవడం ఒక మ్యాజిక్. మన జీవిత ప్రయాణం ప్రారంభించడానికి కౌంట్ డౌన్ మొదలుపెట్టాను అని పోస్ట్ చేసింది. త్వరలోనే ఈ జంట పెళ్లి చేసుకోబోతున్నారు. దీంతో పలువురు ప్రముఖులు, అభిమానులు ఈ కాబోయే జంటకు కంగ్రాట్స్ చెప్తున్నారు. కార్తీక తల్లి రాధా ఇటీవలే పలువురు సినీ ప్రముఖులకు తన కూతురి పెళ్ళికి రమ్మని ఆహ్వానం ఇచ్చి వెళ్లారు.

 

Also Read : Naga Chaitanya : నాగచైతన్య ఫస్ట్ వెబ్ సిరీస్ ‘దూత’ రిలీజ్ ఎప్పుడో తెలుసా? ఏ ఓటీటీలో?