karthika Deepam 2: ఘనంగా కార్తీకదీపం 2 ప్రీ రిలీజ్ ఈవెంట్.. వంటలక్క డాక్టర్ బాబుకి హారతులు?

కార్తీకదీపం.. ఈ సీరియల్ గురించి రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకు ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. తెలుగు టెలివిజన్ చరిత్రలోనే ఈ సీరియల్ ఒక సువర్ణాధ్యాయం అని చెప్పవచ్చు. స్టార్ మా సృష్టించిన ఈ సంచలనం భారతదేశ స్థాయిలో అద్భుతమైన రేటింగ్స్ సాధించి ఆశ్చర్యపరిచింది కార్తీకదీపం సీరియల్ లో పాత్రలు సంతోష పడితే తెలుగు లోగిళ్ళు ఆనందించాయి. ఆ పాత్రలు బాధపడితే వాళ్ళకంటే ఎక్కువగా కన్నీళ్లు పెట్టుకున్నారు. డాక్టర్ బాబు, దీప కేవలం బుల్లితెర పైన కనిపించే రెండు […]

Published By: HashtagU Telugu Desk
Mixcollage 22 Mar 2024 08 52 Am 8319

Mixcollage 22 Mar 2024 08 52 Am 8319

కార్తీకదీపం.. ఈ సీరియల్ గురించి రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకు ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. తెలుగు టెలివిజన్ చరిత్రలోనే ఈ సీరియల్ ఒక సువర్ణాధ్యాయం అని చెప్పవచ్చు. స్టార్ మా సృష్టించిన ఈ సంచలనం భారతదేశ స్థాయిలో అద్భుతమైన రేటింగ్స్ సాధించి ఆశ్చర్యపరిచింది కార్తీకదీపం సీరియల్ లో పాత్రలు సంతోష పడితే తెలుగు లోగిళ్ళు ఆనందించాయి. ఆ పాత్రలు బాధపడితే వాళ్ళకంటే ఎక్కువగా కన్నీళ్లు పెట్టుకున్నారు. డాక్టర్ బాబు, దీప కేవలం బుల్లితెర పైన కనిపించే రెండు పాత్రలు మాత్రమే కాదు. ప్రతి తెలుగు ఇంట్లో ఉండే ఇద్దరు మనుషులు.

అలాంటి కార్తీకదీపం సీరియల్ ఇప్పుడు మళ్ళీ స్టార్ మా లో రాబోతోంది. సీక్వెల్ తో రాబోతున్న ఈ సీరియల్ ప్రీ రిలీజ్ ఈవెంట్ నేడు హైదరాబాద్ లో జరిగింది. ఈ ఈవెంట్ లో ప్రేమ విశ్వనాథ్ అలియాస్ వంటలక్క, నిరుపమ్ పరిటాల అలియాస్ డాక్టర్ బాబు పాల్గొన్నారు. వీరిద్దరికి ప్రీ రిలీజ్ ఈవెంట్ లో తెలుగు ఆడవాళ్లు హారతి ఇచ్చి తమ అభిమానాన్ని చాటుకున్నారు. ఈ కార్తీక దీపం 2 సీరియల్ ని స్టార్ మాలో మార్చి 25 నుంచి ప్రతివారం సోమవారం నుంచి శనివారం వరకు రాత్రి 8 గంటలకు ప్రసారం చేయబోతున్నారు.

కాగా ఈ ఈవెంట్ లో భాగంగా డాక్టర్ బాబు మాట్లాడుతూ.. కార్తీక దీపం ఫస్ట్ సీజన్ నెంబర్ వన్ సీరియల్ అనిపించుకుంది. అప్పట్లో ప్రజాభిమానానికి కొలమానమైన బార్క్. ఈ సీరియల్ తెలుగువాళ్లు ఎంతగానో ఇష్టపడి చూసిన సీరియల్ అని లెక్కల్లో తేల్చి చెప్పింది. జాతీయ స్థాయిలో రిలేషన్‌షిప్స్, ఎమోషన్స్ ని అద్భుతంగా చూపించి, ఫామిలీ డ్రామాని గొప్పగా పండించిన మొట్టమొదటి తెలుగు సీరియల్ కార్తీక దీపం అని సంతోషంగా గర్వంగా చెప్పుకొచ్చారు.

  Last Updated: 22 Mar 2024, 08:55 AM IST