Site icon HashtagU Telugu

Karthi–Vijay Deverakonda: స్టేజ్ స్టెప్పులు ఇరగదీసిన విజయ్,హీరో కార్తీ.. దుమ్ము దులిపేసారుగా?

Karthi–vijay Deverakonda

Karthi–vijay Deverakonda

మామూలుగా సినిమా ఇండస్ట్రీలో అప్పుడప్పుడు ఫ్రీ రిలీజ్ ఈవెంట్లు, సక్సెస్ ఈవెంట్లలో ఒకేసారి ఇద్దరు హీరోయిన్లు ఇద్దరు హీరోలు స్టేజ్ పై కనిపిస్తూ ఉంటారు. ఎక్కువమంది హీరోలు కలిసి కనిపిస్తేనే అభిమానులు పండగ చేసుకుంటారు. అందులోను మంచి ఫాలోయింగ్ ఉన్న హీరోలు కలిసి, స్టెప్పులేస్తే వైరల్ అవ్వాల్సిందే. ఇలా గతంలో చాలామంది హీరోలు స్టేజిపై స్టెప్పులు వేసిన వీడియోలు తెలిసిందే. తాజాగా తమిళ్ స్టార్ హీరో కార్తీ, మన విజయ్ దేవరకొండ కలిసి ఒక ఈవెంట్ లో స్టెప్పులు వేశారు. తాజాగా చెన్నైలో గలాటా గోల్డెన్ స్టార్ అవార్డ్స్ వేడుక జరిగింది.

ఈ అవార్డు వేడుకలకు అనేకమంది తెలుగు, తమిళ్, వేరే భాషల సినీ ప్రముఖులు హాజరయ్యారు. ఈ నేపథ్యంలో విజయ్ దేవరకొండ కూడా ఫ్యామిలీ స్టార్ ప్రమోషన్ లో భాగంగా హాజరయ్యారు. స్టేజిపై కార్తీకి అవార్డు అందించడానికి విజయ్ దేవరకొండ, సందీప్ రెడ్డి వచ్చారు. అవార్డు తీసుకున్న అనంతరం కార్తీ, విజయ్ ని స్టెప్పులు వేయడంతో ఇద్దరూ కలిసి కార్తీ తమిళ్ సాంగ్స్ కి స్టెప్పులు వేశారు. దీంతో కార్తీ, విజయ్ దేవరకొండ చేసిన డ్యాన్స్ వీడియో వైరల్ అయింది. కార్తీ, విజయ్ అభిమానులు తమ హీరోలు ఇలా స్టేజిపై డ్యాన్స్ వేస్తుంటే సంతోషం వ్యక్తం చేస్తూ ఆ డ్యాన్స్ వీడియోలను షేర్ చేస్తున్నారు.

 

ఆ వీడియోలో మొదట కార్తీ స్టెప్పులు వేస్తుండగా కార్తీని చూసి విజయ్ దేవరకొండ కూడా అలాగే స్టెప్పులు వేస్తున్నాడు. ప్రస్తుతం అందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవడంతో సూపర్ ఎక్సలెంట్ అంటూ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు విజయ్ దేవరకొండ అభిమానులు. ఆ వీడియోని సోషల్ మీడియాలో తెగ వైరల్ చేస్తున్నారు.

Exit mobile version