Site icon HashtagU Telugu

Japan Teaser : కార్తీ జపాన్ టీజర్ చూశారా? దీపావళికి సరికొత్త బ్లాస్ట్..

Karthi Japan Movie Teaser Released

Karthi Japan Movie Teaser Released

తమిళ్ హీరో కార్తీ(Karthi)కి తెలుగులో కూడా చాలా మంది అభిమానులు ఉన్నారు. కార్తీ సినిమాలకు తెలుగులో కూడా మంచి మార్కెట్ ఉంది. ఇటీవల ఖైదీ, సర్దార్, పొన్నియన్ సెల్వన్ 1,2 సినిమాలతో వచ్చి వరుస విజయాలు సాధించాడు. త్వరలో జపాన్(Japan) అనే సినిమాతో రాబోతున్నాడు.

జపాన్ సినిమాలో కార్తీ వెరైటీ హెయిర్ కట్ తో, బంగారు పళ్ళతో డిఫరెంట్ లుక్ లో కనపడనున్నాడు. ఈ సినిమా క్రైం కామెడీగా ఉండబోతుందని తెలుస్తుంది. ఇందులో కార్తీ జపాన్ అనే గోల్డ్ స్మగ్లర్ క్యారెక్టర్ చేయనున్నాడు. తాజాగా ఈ సినిమా టీజర్ ని రిలీజ్ చేశారు. టీజర్ లో.. జపాన్ బంగారాన్ని దొంగిలిస్తుంటే పోలీసులు అతని కోసం వెతుకుతున్నట్టు చూపించారు. చివర్లో ఎన్ని బాంబులు వేసినా ఈ జపాన్ ని ఎవరూ ఏమి పీకలేరు రా అని డైలాగ్ చెప్పాడు కార్తీ.

టీజర్ తో సినిమాపై మరింత ఆసక్తిని నెలకొల్పారు. ఇక జపాన్ సినిమాని దీపావళికి తమిళ్, తెలుగులో రిలీజ్ చేయనున్నారు. ఇందులో అను ఇమ్మాన్యుయేల్ హీరోయిన్ గా నటిస్తుంది. ఈ సినిమాలో సునీల్ కూడా ఓ ముఖ్య పాత్ర చేస్తున్నాడు. ఈ సినిమాతో కూడా కార్తీ హిట్ కూడా వరుస హిట్స్ ని కంటిన్యూ చేస్తాడేమో చూడాలి.