Karthi Compete with NTR Movie Devara : బాక్స్ ఆఫీస్ వద్ద పెద్ద హీరోల చిత్రాలు వస్తున్నాయంటే..చిన్న చిత్రాలే కాదు యావరేజ్ హీరోల చిత్రాలు కూడా పోటీ నుండి తప్పుకుంటాయి. అలాంటిది ఎన్టీఆర్ (NTR) తో పోటీకి సై అంటున్నాడు తమిళ్ హీరో కార్తీ (Karthi). ఎన్టీఆర్ (NTR), RRR తర్వాత గ్యాప్ తీసుకొని దేవర సినిమాతో ప్రేక్షకులను పలకరించబోతున్నాడు. మాస్ డైరెక్టర్ కొరటాల శివ (Koratala Siva) దర్శకత్వంలో ఈ మూవీ రాబోతున్న విషయం తెలిసిందే. ఈ మూవీ సెప్టెంబర్ 27న ప్రపంచ వ్యాప్తంగా విడుదలకు సిద్ధమైంది. ఈ సినిమా ఫై ఎలాంటి అంచనాలు నెలకొన్నాయో మాటల్లో చెప్పాల్సిన పనిలేదు. విడుదలకు ముందే దేవర సృష్టిస్తున్న రికార్డ్స్ చూస్తే అర్ధం అవుతుంది. అలాంటి దేవర తో కార్తీ ..‘సత్యం సుందరం’ మూవీతో పోటీకి వస్తా అంటున్నాడు.
కార్తీ కి తెలుగు నాట కూడా వీరాభిమానులు ఉన్నారు. కార్తీ నటించిన చాల చిత్రాలు తెలుగు లో సూపర్ సక్సెస్ అయ్యాయి. కార్తి మూవీస్ పాజిటీవ్ టాక్ వస్తే.. టాలీవుడ్ లో కూడా కాసుల వర్షం కురుస్తుంది. ఇక ప్రస్తుతం ‘సత్యం సుందరం’ మూవీతో ప్రేక్షకులను పలకరించడానికి రెడీ అయ్యాడు. ’96’ ఫేమ్ ప్రేమ్ కుమార్ తెరకెక్కించిన చిత్రంలో అరవింద్ స్వామి, కార్తి లీడ్ రోల్స్ లో నటించారు. అచ్చమైన పల్లెటూరి బ్యాక్ డ్రాప్ లో రాబోతున్న ఈ మూవీ టీజర్ ప్రేక్షకులను ఆకట్టుకుంది. 2డీ బ్యానర్ పై సూర్య , జ్యోతిక నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని సెప్టెంబర్ 28న విడుదల చేస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు.
కాగా ఎన్టీఆర్ నటించిన దేవర సెప్టెంబర్ 27న వరల్డ్ వైడ్ గా రిలీజ్ కాబోతుండగా..నెక్స్ట్ డే నే కార్తీ బరిలోకి వస్తుండడం తో సినీ లవర్స్ అవసరమా కార్తీ అని ప్రశ్నిస్తున్నారు. ఆర్ఆర్ఆర్ తర్వాత ఎన్టీఆర్ రేంజ్ ఏ రేంజ్ కి వెళ్లిందో తెలియంది కాదు..అలాంటి ఎన్టీఆర్ – కొరటాల కలయికలో సినిమా వస్తుంటే..దానికి పోటీ పడడం ఇబ్బందే అవుతుందని అంటున్నారు. కార్తికి తెలుగులో ఫ్యాన్స్ ఉన్నప్పటికీ.. దేవర ఫీవర్ తో ఆల్ ఓవర్ ఇండియా ఊగుతోంది. దాంతో దేవర ముందు కార్తి నిలుస్తాడా? అంటూ నెటిజన్లు సోషల్ మీడియా వేదికగా కామెంట్స్ చేస్తున్నారు. కార్తితో పాటుగా మేకర్స్ ఈ రిస్క్ తీసుకోవడం అవసరమా? అంటూ ప్రశ్నిస్తున్నారు. తమిళ్ లో అదే డేట్ కు రిలీజ్ చేసుకుని, దేవర రిలీజ్ అయిన వారం తర్వాత తెలుగులో విడుదల చేస్తే బాగుంటుందని కొందరు సూచిస్తున్నారు. మరి రిలీజ్ విషయంలో మేకర్స్ ఏమైనా వెనకడుగు వేస్తారేమో చూడాలి.
Read Also : Cricketers Addicted Alcohol: మద్యం వ్యసనం ద్వారా క్రికెట్ కెరీర్ నాశనం చేసుకున్న ఆటగాళ్లు వీరే..!