Sathyam Sundaram : సెప్టెంబర్ 27న ఎన్టీఆర్(NTR) దేవర(Devara) సినిమాతో రాబోతున్న సంగతి తెలిసిందే. అయితే తమిళ్ స్టార్ హీరో కార్తీ కూడా తన సినిమాతో రాబోతున్నారు. కార్తీ(Karthi), అరవింద స్వామి మెయిన్ లీడ్స్ లో నటించిన తమిళ్ సినిమా మేయజగం సెప్టెంబర్ 27న తమిళనాడులో రిలీజ్ కాబోతుంది. అదే రోజు ఇక్కడ దేవర సినిమా ఉండటంతో తెలుగులో మాత్రం ఒక రోజు ఆలస్యంగా అంటే సెప్టెంబర్ 28న రిలీజ్ కాబోతుంది.
తెలుగులో ఈ సినిమా ‘సత్యం సుందరం’ పేరుతో రాబోతుంది. గతంలో విజయ్, త్రిషలతో 96 లాంటి సూపర్ హిట్ సినిమా తీసిన డైరెక్టర్ ప్రేమ్ కుమార్ ఈ సినిమాని తెరకెక్కించాడు. గతంలో ఈ సినిమా టీజర్ రిలీజ్ చేసి ఆసక్తి నెలకొల్పగా తాజాగా సత్యం సుందరం ట్రైలర్ రిలీజ్ చేసారు. మీరు కూడా ఈ సినిమా ట్రైలర్ చూసేయండి..
ట్రైలర్ చూస్తుంటే ఒక ఊరిలో హీరో దగ్గరికి అతని బావ వస్తే అతన్ని ఎలా చూసుకున్నాడు, ఆ బావ ఆ ఊర్లో ఉన్న జ్ఞాపకాలు గుర్తుచేసుకొని ఎలా ఎమోషనల్ అయ్యాడు అనేలా కథ ఉండబోతుందని తెలుస్తుంది. ఈ సినిమా ప్రమోషన్స్ లో కార్తీ మాట్లాడుతూ.. ఒక పల్లెటూరు, మంచి ఎమోషన్స్ ఉన్న ఓ పదేళ్ల క్రితం కథ అని తెలిపారు. ఈ సినిమాలో ఫుల్ గా నవ్విస్తూనే చివర్లో కంటతడి పెట్టిస్తారని, మన చిన్ననాటి రోజులు గుర్తొస్తాయని తెలిపారు. మరి దేవర లాంటి మాస్ సినిమాతో కార్తీ ఓ క్లాస్ సినిమాతో పోటీకి దిగుతుండటంతో అంతా ఈ సినిమా కోసం కూడా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
Also Read : Actor Simbu OG : పవన్ సినిమాలో పాట పాడిన శింబు..