Chiranjeevi Blood Bank : మెగాస్టార్ చిరంజీవి ఎంతోమంది పేదల కోసం బ్లడ్ బ్యాంక్, ఐ బ్యాంక్ మొదలుపెట్టి ఎన్నో ఏళ్లుగా సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. ఇందుకోసం ఎంతోమంది మెగా అభిమానులు చిరంజీవి బ్లడ్ బ్యాంక్ కి వచ్చి ఎన్నో సార్లు రక్త దానం చేసారు. రోజు చిరంజీవి బ్లడ్ బ్యాంక్ లో ఎంతో కొంతమంది రక్తదానం చేస్తూనే ఉంటారు. అనేకమంది సెలబ్రిటీలు కూడా మెగాస్టార్ బ్లడ్ బ్యాంక్ లో రక్తదానం చేసారు.
తాజాగా కర్ణాటక చిక్ బళ్ళాపూర్ MLA ప్రదీప్ ఈశ్వర్ చిరంజీవి బ్లడ్ బ్యాంక్ లో రక్తదానం చేసారు. కర్ణాటక చిక్ బళ్ళాపూర్ శాసన సభ్యులు ప్రదీప్ ఈశ్వర్, అతని బంధువులు పలువురు నేడు హైదరాబాద్ రాగా చిరంజీవి బ్లడ్ బ్యాంకుకి వచ్చి రక్తదానం చేసారు. అనంతరం చిరంజీవి ఇంట్లో ప్రదీప్ ఈశ్వర్ ఆయన్ని కలిశారు. రక్తదానం చేసినందుకు చిరంజీవి ఎమ్మెల్యే ప్రదీప్ ఈశ్వర్ ని అభినందించారు.
Also Read : Rajamouli : ‘కల్కి’ మూవీ రాజమౌళి ఫొటోలు లీక్.. ఈ లుక్స్ లో రాజమౌళి విలన్ గా చేస్తే..