Karnataka Government Invited Jr.NTR: క‌ర్ణాట‌క అసెంబ్లీకి జూనియ‌ర్!

జూనియ‌ర్ ప్ర‌భ క‌ర్ణాట‌క రాష్ట్రంలోనూ వెలుగుతోంది. ఆ రాష్ట్ర అసెంబ్లీలో నవంబర్ 1న జరగనున్న కన్నడ రాజ్యోత్సవం కార్యక్రమానికి టాలీవుడ్ యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ముఖ్య అతిథిగా హాజరు కానున్నారు

Published By: HashtagU Telugu Desk
Ntr

Ntr

జూనియ‌ర్ ప్ర‌భ క‌ర్ణాట‌క రాష్ట్రంలోనూ వెలుగుతోంది. ఆ రాష్ట్ర అసెంబ్లీలో నవంబర్ 1న జరగనున్న కన్నడ రాజ్యోత్సవం కార్యక్రమానికి టాలీవుడ్ యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ముఖ్య అతిథిగా హాజరు కానున్నారు. ఆ మేరకు కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై కార్యాలయం శనివారం ధ్రువీకరించింది.

రాజ్యోత్స‌వానికి జూనియర్ ఎన్టీఆర్ తో పాటు తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ సహా పునీత్ రాజ్ కుమార్ కుటుంబం కూడా హాజరు కానుంది. ఇటీవలే మరణించిన పునీత్ రాజ్ కుమార్ కు కర్ణాటక సర్కారు ఆ రాష్ట్ర అత్యున్నత పురస్కారం కర్ణాటక రత్న అవార్డును అందజేయనుంది. పునీత్ రాజ్ కుమార్ తో జూనియర్ ఎన్టీఆర్ కు మంచి స్నేహమే ఉన్న సంగతి తెలిసిందే.

Also Read:   Kantara: కాంతార మూవీ మేకర్స్‌కు షాక్ ఇచ్చిన కోర్టు..!

పునీత్ మరణించిన రోజు ఆయన పార్థివ దేహానికి నివాళి అర్పించేందుకు జూనియర్ ఎన్టీఆర్ బెంగళూరు వెళ్లారు. ఇప్పుడు పునీత్ కు గుర్తుంపుగా అవార్డు ఇస్తున్న కార్యక్రమానికి ఆయనతో అత్యంత సన్నిహితంగా మెలగిన ప్రముఖులను ఆహ్వానించాలని కర్ణాటక సర్కారు భావించింది. ఆ జాబితాలో జూనియర్ ఎన్టీఆర్ ను ఈ వేడుకకు ఆహ్వానించింది.

  Last Updated: 29 Oct 2022, 04:37 PM IST