Site icon HashtagU Telugu

Ram Charan Met CM: సీఎం సిద్ధ‌రామ‌య్య‌ను క‌లిసిన రామ్ చ‌ర‌ణ్‌.. వీడియో వైర‌ల్‌!

Ram Charan Met CM

Ram Charan Met CM

Ram Charan Met CM: టాలీవుడ్ స్టార్ హీరో రామ్ చరణ్, కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్యతో భేటీ (Ram Charan Met CM) అయ్యారు. ఈ సమావేశం మైసూర్‌లో జరిగింది. దీనికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి. ముఖ్యంగా ఇద్దరూ నవ్వుతూ మాట్లాడుకుంటున్న దృశ్యాలు అభిమానులను ఆకట్టుకుంటున్నాయి. పెద్ది సినిమా షూటింగ్ ప్ర‌స్తుతం మైసూర్‌లోనే జ‌రుగుతుంది. అయితే సీఎం సిద్ధ‌రామ‌య్య కూడా మైసూర్‌లోనే ఉండ‌టంతో ఈ భేటీ జ‌రిగిన‌ట్లు తెలుస్తోంది.

ఈ సమావేశం ప్రధానంగా మర్యాదపూర్వక భేటీగానే జరిగిందని సమాచారం. అయితే వీరిద్దరి మధ్య సినిమా పరిశ్రమ, అభివృద్ధి, కర్ణాటక-తెలంగాణ సంబంధాలు వంటి పలు విషయాలపై చర్చ జరిగిందని తెలుస్తోంది. కర్ణాటకలో సినిమా షూటింగ్‌ల కోసం అనుమతులు, ప్రోత్సాహకాలు వంటి అంశాలపై కూడా రామ్ చరణ్ చర్చించి ఉండవచ్చునని సినీ వర్గాలు భావిస్తున్నాయి.

Also Read: India-China: అమెరికాకు వార్నింగ్‌.. వచ్చే ఏడాది భారత్‌కు చైనా అధ్య‌క్షుడు!

ఎలాంటి సందర్భం లేకుండా భేటీ ఎందుకు?

సాధారణంగా ఇలాంటి భేటీలు ఒక నిర్దిష్ట కార్యక్రమం లేదా అవార్డు ఫంక్షన్ సందర్భంగా జరుగుతాయి. కానీ ఎలాంటి ప్రత్యేక సందర్భం లేకుండా రామ్ చరణ్ నేరుగా సీఎంను కలవడం ఆసక్తిని రేకెత్తించింది. రామ్ చరణ్ స్వయంగా నిర్మాణ రంగంలోనూ ఉన్నారు. కాబట్టి భవిష్యత్తులో కర్ణాటకలో సినిమా నిర్మాణాలను చేపట్టేందుకు ఈ భేటీ ఒక నాంది కావచ్చని ఊహాగానాలు వినిపిస్తున్నాయి.

రామ్ చరణ్ ప్రస్తుతం నటిస్తున్న పెద్ది సినిమా షూటింగ్‌తో బిజీగా ఉన్నారు. ఈ భేటీ ఆయన వ్యక్తిగత పర్యటనలో భాగంగా జరిగిందా లేక ఒక ప్రత్యేక ఉద్దేశంతో జరిగిందా అనేది ఇంకా స్పష్టంగా తెలియలేదు. కానీ ఈ భేటీ మాత్రం మీడియా, సోషల్ మీడియాలో ప్రముఖంగా నిలిచింది. ఇక‌పోతే పెద్ది సినిమాను మైత్రీ మూవీ మేక‌ర్స్ సంస్థ నిర్మిస్తుండ‌గా.. బుచ్చిబాబు ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న సంగ‌తి తెలిసిందే. పెద్ది మూవీ వ‌చ్చే ఏడాది మార్చిలో విడుద‌ల కానున్న విష‌యం తెలిసిందే.

Exit mobile version