42 ఏళ్లుగా షోలెను ఆరాధిస్తూనే ఉన్న రామనగర

కర్నాటకలోని రామనగర ప్రాంతానికి వెళ్తే.. ఇప్పటికీ అక్కడ షోలే పోస్టర్లు కనిపిస్తాయి. అక్కడి రైల్వే స్టేషన్ గోడలపైనా షోలె సినిమాలోని సీన్లు పెయింట్ చేసి ఉంటాయి. షోలె సినిమా ప్రమోషన్ కోసం రైల్వే శాఖ పెద్ద ప్రయత్నమే చేసింది. ఇంతకీ రైల్వే శాఖనే ఈ సినిమా ప్రమోషన్ ఎందుకు చేయాల్సి వచ్చిందనే దాని వెనక పెద్ద స్టోరీనే ఉంది.

  • Written By:
  • Updated On - November 6, 2021 / 12:36 PM IST

కర్నాటకలోని రామనగర ప్రాంతానికి వెళ్తే.. ఇప్పటికీ అక్కడ షోలే పోస్టర్లు కనిపిస్తాయి. అక్కడి రైల్వే స్టేషన్ గోడలపైనా షోలె సినిమాలోని సీన్లు పెయింట్ చేసి ఉంటాయి. షోలె సినిమా ప్రమోషన్ కోసం రైల్వే శాఖ పెద్ద ప్రయత్నమే చేసింది. ఇంతకీ రైల్వే శాఖనే ఈ సినిమా ప్రమోషన్ ఎందుకు చేయాల్సి వచ్చిందనే దాని వెనక పెద్ద స్టోరీనే ఉంది.

షోలె సినిమా గురించి ప్రత్యేకంగా చెప్పుకోనక్కర్లేదు. దాని గురించి అందరికీ తెలిసిందే. కాని, కొత్త తరం వాళ్లకి తెలియాల్సింది ఏంటంటే.. ఈ బాలీవుడ్ సినిమా షూటింగ్ కర్నాటకలోని రామనగరలో జరిగిందనే విషయం అందరికీ తెలియాల్సి ఉందని స్వయంగా రైల్వే శాఖ అధికారులే చెబుతున్నారు. ఐకానిక్ సినిమాగా సెన్సేషన్ సృష్టించిన షోలె సినిమా.. బెంగళూరు నగరానికి 50 కిలోమీటర్ల దూరంలో ఉన్న గ్రానైట్ కొండ ప్రాంతాల్లో షూటింగ్ జరుపుకుందని ఇప్పటి తరంలో ఎంత మంది తెలుసు? ఆ ప్రాంతమే రామనగర అని తెలిసిన వారు ఎంతమంది? 42 ఏళ్ల క్రితం.. అందరినీ భయపెట్టిన గజదొంగ గబ్బర్ సింగ్, రెండు చేతులు కోల్పోయిన ఠాకూర్, బసంతి… వీళ్లంతా భారతీయుల హృదయాలు కొల్లగొట్టి.. ఇప్పటికీ సుస్థిర స్థానం సంపాదించుకున్నారు. షోలె సినిమాకు బ్యాక్‌డ్రాప్ స్టోరీగా నడిచింది ఇక్కడి కొండ శిఖరాల్లో జరిగిన కథే.

ఇప్పటికీ రామనగర ప్రాంతవాసులకు తాజా జ్ఞాపకాలుగా ఆనాటి రోజులు గుర్తుకొస్తుంటాయి. ఇప్పటికీ రామనగర రైల్వే స్టేషన్ గోడలు, పరిసరాల్లో షోలె సినిమాలోని సీన్లు పెయింట్ వేసి కనిపిస్తాయి. గోడల మీద కనిపిస్తున్న షోలె పెయింటింగ్స్ చూస్తూ రామనగర రైల్వే స్టేషన్‌కు వస్తుంటారు ప్రయాణికులు. మౌనంగా, చూపు మరల్చకుండా, ఆ పెయింటింగ్స్‌నే చూస్తుంటారు. ఓ చరిత్ర సృష్టించిన ఆ సినిమాకు ఇలా మౌనంగానే నివాళులు అర్పిస్తారు. ఇలా షోలె సినిమా సీన్లను పెయింటింగ్ వేయడాన్ని ప్రయాణికులు చాలా బాగా స్వాగతించారు. ఇలాంటి ప్రయత్నమే చుట్టుపక్కల స్టేషన్లలోనూ చేస్తే బాగుంటుందని ఇక్కడి రైల్వే అధికారులు అభిప్రాయపడుతున్నారు.

షోలె సినిమాను గోడలపై పెయింట్ చేయడం ద్వారా మరో ప్రయోజనం కూడా కలుగుతోంది. ఇక్కడి గోడలను చాలా శుభ్రంగా ఉంచుతున్నారు ఇక్కడి స్థానికులు. ఉమ్ము వేయడం గాని, మూత్రం పోయడం గాని చేయడం లేదు. దీంతో షోలె సీన్ల కారణంగా గోడలు, పరిసర ప్రాంతాలు ఎప్పుడూ శుభ్రంగా ఉంటున్నాయని చెబుతున్నారు. షోలె, రామనగరకు ఉన్న అనుబంధాన్ని మరిచిపోనీయకుండా చేస్తోంది ఇక్కడి రైల్వే శాఖ. ఇక్కడి గోడలపై వేసిన షోలె పెయింటింగ్స్ ఎప్పుడూ ఆ అనుబంధాన్ని గుర్తు చేస్తూనే ఉంటుంది. మరోవైపు భారత ప్రేక్షకులు సైతం షోలె సినిమాను మరిచిపోలేరు. ముఖ్యంగా అందులోని డైలాగులు ఇప్పటికీ టపాసుల్లాగా పేలుతూనే ఉన్నాయి. గబ్బర్ సింగ్ పలికిన… అరే ఓ సాంబా, కిత్నే ఆద్మీ థీ, తెరా క్యా హోగా, కాలియా వంటి పదాలను భారత ప్రేక్షకులు ఎప్పటికీ నెమరవేసుకుంటూనే ఉంటారు. ఇప్పుడు రైల్వే శాఖ చేసిన ప్రయత్నం వల్ల షోలె సినిమాకు, రామనగర ప్రాంతానికి ఉన్న అనుబంధం ప్రపంచం మొత్తానికి తెలిసింది.

రామనగరలో షూటింగ్ జరుపుకున్న షోలె సినిమా.. ఇండియన్ సినిమా హిస్టరీలోనే ఓ చరిత్ర సృష్టించడం తమకెంతో గర్వకారణం అని చెబుతుంటారు ఇక్కడివాళ్లు. ఆ కొండ శిఖరాల్లో జరిగిన షూటింగ్‌ను ఇప్పటికీ గుర్తుచేసుకుంటుంటారు. రామదేవర బెట్టా అని పిలిచే ఈ ప్రాంతంలో షూటింగ్ జరగడంతో.. అప్పటి నుంచి ఈ ప్రాంతాన్ని షోలె బెట్టాగా పిలవడం మొదలుపెట్టారు. మొత్తం 350 మెట్లతో ఉన్న కొండపై భాగం నుంచి చూస్తే.. షోలె సినిమాలో కనిపించిన అన్ని లోకేషన్స్ ఇప్పటికీ ఇక్కడ కనిపిస్తాయి.