Karan Johar Says: ఐ యామ్ ఫ్యాన్ ఆఫ్ సాయి పల్లవి!

నటి సాయిపల్లవిపై బాలీవుడ్ నిర్మాత కరణ్ జోహార్ ప్రశంసల జల్లు కురిపించారు.

Published By: HashtagU Telugu Desk
Karan

Karan

నటి సాయిపల్లవిపై బాలీవుడ్ నిర్మాత కరణ్ జోహార్ ప్రశంసల జల్లు కురిపించారు. ఇటీవల విడుదలైన రానా దగ్గుబాటి, సాయి పల్లవి నటించిన ‘విరాట పర్వం’ థియేట్రికల్ ట్రైలర్‌ను ఆయన తన ట్విట్టర్‌లో షేర్ చేశారు. అంతేకాదు.. తాను సాయి పల్లవికి వీరాభిమానిని అని స్టేట్ మెంట్ ఇచ్చాడు. రానా-సాయి పల్లవిల ‘విరాట పర్వం’ ట్రైలర్‌ను ప్రశంసిస్తూ.. “ఇది అద్భుతంగా కనిపిస్తోంది రానా!!!!” అంటూ ట్వీట్ చేశాడు. “నేను దీన్ని చూడటానికి ఎగ్జైట్‌గా ఉన్నాను! యు ఆర్ ఫెంటాస్టిక్! నేను కూడా సాయి పల్లవి ఫ్యాన్‌నే!” అంటూ ప్రశంసలు కురిపించారు. సాయి పల్లవి తన తరం టాలెంటెడ్ నటీమణులలో ఒకరు. ‘విరాట పర్వం’ ట్రైలర్ లో ఆమె నటన నెక్ట్స్ లెవల్. కథకు తగ్గట్టుగా తనను తాను మార్చుకుంది. వేణు ఊడుగుల దర్శకత్వంలో తెరకెక్కిన ‘విరాట పర్వం’ జూన్ 17న విడుదల కానుంది. ఈ చిత్రంలో నవీన్ చంద్ర, నివేదా పేతురాజ్, ఈశ్వరీ రావు, ప్రియమణి తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రానికి సంగీతం సురేష్ బొబ్బిలి స్వరాలు సమకుర్చారు.

https://twitter.com/karanjohar/status/1533848306714963972

  Last Updated: 08 Jun 2022, 01:47 PM IST