Site icon HashtagU Telugu

Karan Johar: ఫిట్నెస్ కోసం టాబ్లెట్స్ వాడుతున్నాడు అంటూ వార్తలు.. ఘాటుగా స్పందించిన కరణ్ జోహార్?

Karan Johar

Karan Johar

బాలీవుడ్ డైరెక్టర్, నిర్మాత కరణ్ జోహార్ గురించి మనందరికి తెలిసిందే. కరణ్ జోహార్ ప్రస్తుతం ఒకవైపు షో లకు హోస్ట్ గా వ్యవహరిస్తూనే మరోవైపు నిర్మాతగా సినిమాలను తెరకెక్కిస్తూ నిర్మాతగా కూడా గుర్తింపు తెచ్చుకున్నారు. ఇది ఇలా ఉంటే తాజాగా ఐఫా అవార్డుల వేడుకలో మెరిశారు. రాజస్థాన్‌ లోని జైపూర్ వేదికగా జరిగిన ఈవెంట్‌ లో ఆయన సందడి చేశారు. ఇటీవల తన ఫిట్‌నెస్‌ గురించి వస్తున్న వార్తలపై తాజా ఈవెంట్‌ లో స్పందించారు. స్లిమ్‌ గా కనిపించడానికి గల కారణాలను వివరించాడు.

తన ఫిట్‌నెస్‌ కు ప్రధాన కారణం అలవాట్లేనని కరణ్ జోహార్ వెల్లడించారు. సరైన టైమ్‌ కి తినడం, వ్యాయామం చేయడం వల్లే సాధ్యమైందని తెలిపారు. ఫిట్‌నెస్‌ కు క్రమ శిక్షణతో కూడిన జీవనశైలి ముఖ్యమని డైరెక్టర్‌ సలహా ఇచ్చాడు. దీంతో కరణ్ బరువు తగ్గడం పై వస్తున్న వార్తలకు ఆయన చెక్‌ పెట్టారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. కరణ్ జోహార్ బరువు తగ్గేందుకు ఓజెంపిక్ వంటి డయాబెటిక్ మందుల వాడుతున్నారని రూమర్స్ వచ్చాయి.

ఇటీవల ఒక ఇంటర్వ్యూలో ఆయన సన్నిహిత మిత్రుడు మహీప్ కపూర్ వ్యాఖ్యల తర్వాత ఆ రూమర్స్ మరింత ఊపందుకున్నాయి. ప్రముఖ నెట్‌ ఫ్లిక్స్ షో లైవ్స్ వర్సెస్ బాలీవుడ్ వైవ్స్‌ లో మహీప్ కపూర్ ఈ విషయంపై మాట్లాడారు. తాజాగా కరణ్ క్లారిటీ ఇవ్వడంతో ఇకపై ఆ వార్తలకు చెక్ పడనుంది. కాగా గతంలో స్లిమ్‌ గా ఉంటూ తన ఫిట్‌నెస్‌ పట్ల నిబద్ధతను చాటుకున్నారు కరణ్ జోహార్. ఈ సందర్బంగా కరణ్ జోహార్ చేసిన వాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.