ప్రస్తుతం అన్ని ఇండస్ట్రీ లలో రీ రిలీజ్ ట్రెండ్ (Re Release Trend) అనేది నడుస్తుంది. గతంలో సూపర్ హిట్ అయినా చిత్రాలు , పలు హీరోల తాలూకా మైలు రాయి చిత్రాలను సరికొత్త టెక్నలాజి లతో ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తూ అలరిస్తున్నారు. టాలీవుడ్ లో ఈ తరహా చిత్రాలు విపరీతంగా ఆకట్టుకున్నాయి. అగ్ర హీరోల నుండి చిన్న హీరోల చిత్రాల వరకు రీ రిలీజ్ అవుతూ వస్తున్నాయి.
ఇక ఇప్పుడు బాలీవుడ్ లో సూపర్ హిట్ గా నిలిచినా మూవీ రీ రిలీజ్ అయ్యేందుకు సిద్ధమైంది. షారుఖ్ ఖాన్, సల్మాన్ ఖాన్ (Shah Rukh Khan and Salman Khan) కలయికలో తెరకెక్కిన ‘కరణ్ అర్జున్’ (karan arjun re release ) సినిమా దాదాపు 30 ఏళ్ల తర్వాత రీరిలీజ్ కాబోతుంది. ఇందుకు సంబంధించి తాజాగా టీజర్ రిలీజ్ అయింది. రాకేష్ రోషన్ స్వీయ నిర్మాణంలో తెరకెక్కించిన ఈ మూవీలో రాఖీ, కాజోల్, మమతా కులకర్ణి, అమ్రిష్ పురి తదితరులు నటించారు. 1995 జనవరి 13న విడుదలైన ఈ చిత్రం థియేటర్లలో 75 వారాలపాటు ఆడింది. షారుఖ్, సల్మాన్ కలిసి నటించిన తొలి సినిమా ఇదే కావడం విశేషం.
ఈ మూవీ కథ విషయానికి వస్తే.. కరణ్ (షారుఖ్ ఖాన్) మరియు అర్జున్ (సల్మాన్ ఖాన్) అనే ఇద్దరి స్నేహితుల కథ ఇది. తమ తండ్రిని హత్య చేసినందుకు అత్యాశతో ఉన్న మామ నుండి ప్రతీకారం తీర్చుకునే ఇద్దరు నామమాత్రపు సోదరుల కథ చుట్టూ ఈ చిత్రం తిరుగుతుంది, కానీ అతనిచే చంపబడి, పగను పూర్తి చేయడానికి పునర్జన్మ పొందుతారు. ఆలా పునర్జన్మ పొందిన వారు ఎలా పగ తీసుకుంటారనేది కథ. ఈ సినిమా దాదాపు 30 సంవత్సరాల తర్వాత రీరిలీజ్ అవ్వడం, పాత అభిమానులను మళ్ళీ స్మృతుల్లోకి తీసుకువెళ్లడం మరియు కొత్త తరం ప్రేక్షకులకు అందించేందుకు ఒక గొప్ప అనుభూతిని అందించడం ఖాయం.
Read Also : Maharashtra : మహారాష్ట్ర ఎన్నికలు.. సీఎం ఏకనాథ్ షిండే నామినేషన్ దాఖలు