Site icon HashtagU Telugu

Kapoor Sisters Dating: కపూర్ సిస్టర్స్ ఒకే వ్యక్తితో డేటింగ్ చేస్తున్నారా!

Kapoor Sisters

Kapoor Sisters

బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ ప్రస్తుతం నవంబర్ 4న విడుదల కానున్న తన చిత్రం ‘మిల్లి’ ప్రమోషన్‌లో బిజీగా ఉంది. ఇది కన్నడ హిట్ మూవీ ‘హెలెన్’కి రీమేక్. సినిమాను ప్రేక్షకుల్లో తీసుకోవడానికి ప్రమోషన్స్ జోరు పెంచింది ఈ అమ్మడు. వరుస ఇంటర్వ్యూలు ఇస్తూ ఆకట్టుకుంటోంది. అయితే ఇంట్రస్టింగ్ న్యూస్ ఏంటంటే.. జాన్వీ, ఆమె చెల్లెలు ఖుషీ ఒకే వ్యక్తితో డేటింగ్ చేస్తున్నారని బాలీవుడ్ వర్గాలలో రూమర్స్ వినిపిస్తున్నాయి. సిస్టర్స్ ఇద్దరూ ఒకే వ్యక్తితో డేటింగ్ చేస్తున్నారనే విషయం తమకు తెలియదని కొందరు చెబుతుండగా, మరికొంత మంది మాత్రం అవునని సమాధానమిస్తున్నారు.

సోషల్ మీడియాలో ఈ గాసిప్ హల్ చల్ చేస్తుండగా, వాటికి చెక్ పెట్టాలని నిర్ణయించుకుంది జాన్వీ. అక్షత్ రంజన్ చిన్నప్పటి నుండి మంచి ఫ్రెండ్స్ అని, అతనితో డేటింగ్ చేయడం లేదని రియాక్ట్ అయ్యింది. అయితే జాన్వీ అతనితో విడిపోయిందని, ఖుషీ మాత్రం అతనితో డేటింగ్ చేస్తోందని తెలుస్తోంది. ‘ధడక్’ ‘రూహి’ లాంటి హారర్ కామెడీ, ‘గుడ్ లక్ జెర్రీ’ క్రైమ్ కామెడీతో పాటు ది కార్గిల్ గర్ల్’ లాంటి ఇంట్రస్టింగ్ బయోపిక్స్ చేసింది. నటిగా తనను తాను నిరూపించుకునే లక్ష్యంతో జాన్వీ కథాబలమున్న సినిమాలను సెలక్ట్ చేసుకుంటోంది.

Exit mobile version