Site icon HashtagU Telugu

Kanthara Rishab Shetty : హనుమాన్ లో కాంతారా రిషబ్ శెట్టి.. ప్రశాంత్ వర్మ ప్లానింగ్ పెద్దదే..!

Rishab Shetty Another Telugu Movie

Rishab Shetty Another Telugu Movie

Kanthara Rishab Shetty ఇప్పుడు ఎక్కడ చూసినా ప్రశాంత్ వర్మ తెరకెక్కిన హనుమాన్ సినిమా గురించే మాట్లాడుకుంటున్నారు. తేజా సజ్జ లీడ్ రోల్ లో తెరకెక్కించిన ఈ సినిమా సంక్రాంతికి రిలీజై సెన్సేషనల్ హిట్ అయ్యింది. సినిమా 30 కోట్ల లోపు బడ్జెట్ తో నిర్మించగా ఇప్పటికే 200 కోట్ల పైన వసూళ్లను రాబట్టింది. అయోధ్య రామ మందిర్ ఏర్పాటు, బాల రాముడి విగ్ర ప్రతిష్ట ఇవన్నీ కూడా హనుమాన్ సినిమాకు అనుకోకుండా కలిసి వచ్చాయి.

We’re now on WhatsApp : Click to Join

అఫ్కోర్స్ సినిమాతో ప్రశాంత్ వర్మ తన టాలెంట్ మరోసారి ప్రూవ్ చేశారు. హనుమాన్ సినిమాలో విభీషణుడి పాత్ర ఉన్నతసేపు బాగా చూపించారు. అయితే ఆ విభీషణుడి పాత్రకు మొదట కాంతారా రిషబ్ శెట్టిని అనుకున్నారట ప్రశాంత్ వర్మ. కాంతారా రిలీజైన టైం లో ఆ సినిమా ప్రమోషన్స్ లో బిజీగా ఉన్న రిషబ్ శెట్టి హనుమాన్ ఆఫర్ ని సున్నితంగా తిరస్కరించాడట.

విభీషణుడిగా రిషబ్ శెట్టి చేసుంటే కచ్చితంగా హనుమాన్ కి ఇంకాస్త కలిసి వచ్చేది. అంతేకాదు విభీషణుడిగా రిషబ్ శెట్టి చేస్తే అతనికి కూడా ఈ సినిమా ప్లస్ అయ్యేది. అయితే ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ లో రిషబ్ శెట్టిని మాత్రం ఏదో ఒక సినిమాలో చూస్తామని తెలుస్తుంది. ఇది నిజంగా క్రేజీ న్యూస్ అని చెప్పొచ్చు.

Also Read : Prabhas Raja Saab Chrismas Release : క్రిస్ మస్ కి రెడీ అవుతున్న రాజా సాబ్.. సలార్ సెంటిమెంట్ రిపీట్..!