గత సంవత్సరం బాగా వినపడిన సినిమాల్లో కాంతార(Kanthara) ఒకటి. కన్నడలో(Kannada) చిన్న సినిమాగా రిలీజయి మంచి విజయం సాధించిన కాంతార అనంతరం అన్ని భాషల్లో రిలీజయి భారీ విజయం సాధించింది. కేవలం 20 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన కాంతార సినిమా ఏకంగా 400 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ వసూలు చేసి అందర్నీ ఆశ్చర్యపరిచింది.
కాంతార సినిమా అంత మంచి విజయం సాధించడానికి ఆ సినిమాలో సాంగ్స్, సినిమాకు ఇచ్చిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా చాలా ప్లస్ అయింది. కాంతారకు కన్నడ మ్యూజిక్ డైరెక్టర్ అజనీష్ లోక్‌నాథ్ సంగీతం అందించారు. ఈ సినిమాతో అజనీష్ కు మంచి పేరు వచ్చింది. అప్పటికే ఓ 25 సినిమాల వరకు కన్నడలో మ్యూజిక్ అందించాడు అజనీష్. గతంలో కాంతారకు ముందు తెలుగులో కిరాక్ పార్టీ, నన్ను దోచుకుందువటే సినిమాలకి సంగీతం అందించాడు అజనీష్.
తాజాగా ఈ కన్నడ సంగీత దర్శకుడు అజనీష్ లోక్‌నాథ్ తెలుగులో విరూపాక్ష సినిమాకు సంగీతం అందించాడు. సాయిధరమ్ తేజ్, సంయుక్త మీనన్ జంటగా కార్తీక్ దండు దర్శకత్వంలో తెరకెక్కిన విరూపాక్ష సినిమా ఏప్రిల్ 21న రిలీజ్ కాబోతుంది. ఇప్పటికే రిలీజయిన టీజర్, ట్రైలర్, సాంగ్స్ తో సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. సాయిధరమ్ తేజ్ యాక్సిడెంట్ తర్వాత ఈ సినిమాతో కంబ్యాక్ ఇవ్వడం, మొదటి సారి తేజ్ హారర్, సస్పెన్స్ జోనర్ లో సినిమా చేయడం, వరుస హిట్స్ మీదున్న సంయుక్త ఇందులో హీరోయిన్ గా ఉండటంతో సినిమాపై చాలా పాజిటివ్ వైబ్స్ ఉన్నాయి. అభిమానులు, సినీ ప్రేమికులు ఈ సినిమా కోసం ఎదురుచూస్తున్నారు.
తాజాగా ఆదివారం నాడు ఏలూరులో జరిగిన విరూపాక్ష ప్రీ రిలీజ్ ఈవెంట్ లో దర్శకుడు సుకుమార్ కాంతార మ్యూజిక్ డైరెక్టర్ అజనీష్ ని అందరికి పరిచయం చేశాడు. దీంతో సినిమాపై మరిన్ని అంచనాలుపెరిగాయి.
Also Read : Rajamouli Daughter : రాజమౌళి కూతుర్ని చూశారా? అప్పుడే ఇంత పెద్దదైపోయిందా?