Site icon HashtagU Telugu

Kantara: కాంతార మూవీ మేకర్స్‌కు షాక్ ఇచ్చిన కోర్టు..!

Kantara Chapter 1

Kantara Chapter 1

‘కాంతార’ మేకర్స్‌కు కేరళ కోర్టు షాకిచ్చింది. సినిమాలోని ‘వరాహ రూపం’ పాటను ప్లే చేయకూడదని తెలిపింది. సినిమాలోని పాటను తమ ‘నవరసం’ పాట నుంచి తీసుకున్నారని కేరళ తైక్కుడం బ్రిడ్జ్ బ్యాండ్ ఆరోపించింది. ఈ నేపథ్యంలో కోర్టు తీర్పునిచ్చింది. అంతేకాకుండా సినిమాను స్ట్రీమ్ చేయనున్న ఓటీటీ ఫ్లాట్‌ఫార్మ్ కూడా బ్యాండ్ అనుమతి లేకుండా పాటను ప్లే చేస్తే చర్యలు ఉంటాయని ధర్మాసనం పేర్కొంది.

భూతకోల నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమాలో వరాహ రూపం పాటను ఇకపై ప్రదర్శించకూడదని కేరళలోని కోజికోడ్‌ జిల్లా సెషన్స్‌ కోర్టు ఆదేశించింది. సినిమాలోని వరాహ రూపం పాటను తమ ‘నవరసం’ పాట నుంచి తీసుకున్నారని కేరళకు చెందిన తైక్కుడం బ్రిడ్జ్‌ అనే మ్యూజిక్‌ బ్యాండ్‌ ఇటీవల న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. తాజాగా కోర్టు నుంచి ఈ తీర్పు వచ్చింది. తైక్కుడం బ్రిడ్జ్ బ్యాండ్ అనుమతి లేకుండా థియేటర్లలో, యూట్యూబ్‌, ఇతర యాప్స్‌లో ప్రదర్శించకూడదని తెలిపింది. ఈ విషయంలో తమకు అండగా నిలిచిన వారందరికీ తైక్కుడం బ్రిడ్జ్ బ్యాండ్ ధన్యవాదాలు తెలిపింది.

Exit mobile version