Site icon HashtagU Telugu

Kantara Beats Bollywood: దుమ్మురేపుతున్న కాంతార, బాలీవుడ్ బాక్సాఫీస్ రికార్డులు బద్దలు!

Kantara Chapter 1

Kantara Chapter 1

కన్నడలో చిన్న సినిమాగా మొదలైన కాంతారా మూవీ ఇంతింతై వటుడింతై అన్నట్టుగా దూసుకుపోతోంది. ఇప్పటికే పొన్నియిన్ సెల్వన్, గాడ్ ఫాదర్, విక్రమ్ సినిమాలను రికార్డులను బ్రేక్ చేసిన కాంతార మూవీ బాలీవుడ్ సినిమాల రికార్డులను కూడా బద్దలుకొట్టింది. ఈసారి గదర్ పేరిట ఉన్న ఇరవై ఒక్క సంవత్సరాల రికార్డును అధిగమించింది. ఈ చిత్రం ఎనిమిదో వారంలో దాదాపు 12.70 కోట్లు సాధించింది. గదర్ మాత్రం 7 కోట్లు మాత్రమే సాధించింది. ఇప్పటికే బాలీవుడ్ లో బాహుబలి 2 రికార్డులను అధిగమించిన విషయం తెలిసిందే.

ఈ సినిమా మొత్తం బాక్సాఫీస్ కలెక్షన్స్ రూ. భారతదేశంలో సుమారుగా 357 కోట్లు. ఓవర్సీస్ నుంచి 33 కోట్లు రాగా, ప్రపంచ వ్యాప్తంగా రూ. సుమారు 390 కోట్లు ఈ చిత్రం నిన్న డిజిటల్‌గా విడుదలైంది. కర్నాటకలో ఇప్పటివరకు ఈ మూవీకి సుమారుగా 171 కోట్లు వచ్చాయి. KGF 2 కంటే అధిగమించి అగ్రస్థానాన్ని కైవసం చేసుకుంటోంది. ఇండియాతో పాటు ఓవర్సీస్ కలిపిత్ మొత్తం 400 కోట్లు సాధించినట్టు ట్రేడ్ వర్గాల అంచనా.

బాక్సాఫీస్ కలెక్షన్లు

మొదటి వారం – రూ. 26.60 కోట్లు

రెండవ వారం – రూ. 37.10 కోట్లు

మూడో వారం – రూ. 75.70 కోట్లు

నాలుగవ వారం – రూ. 71.50 కోట్లు

ఐదు వారం – రూ. 64.50 కోట్లు

ఆరవ వారం – రూ. 44 కోట్లు

ఏడు వారం – రూ. 24.40 కోట్లు

ఎనిమిది వారం – రూ. 12.70 కోట్లు

మొత్తం – రూ. 356.50 కోట్లు

 

Exit mobile version