Kantara: ప్రముఖ కన్నడ నటుడు, దర్శకుడు రిషబ్ శెట్టి పుట్టినరోజు సందర్భంగా ఆయన అభిమానులకు చిత్రబృందం భారీ కానుక ఇచ్చింది. రిషబ్ శెట్టి స్వీయ దర్శకత్వంలో నటిస్తున్న మెగాపాన్ ప్రాజెక్ట్ ‘కాంతార: ఏ లెజెండ్ – చాప్టర్ 1’ నుంచి ఒక శక్తివంతమైన పోస్టర్‌ను విడుదల చేయడమే కాదు, ఈ చిత్రం విడుదల తేదీ కూడా అధికారికంగా ప్రకటించారు. గాంధీ జయంతి కానుకగా ఈ ఏడాది అక్టోబర్ 2న సినిమాను ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల చేయనున్నారు.
‘కాంతార’ అనే సంచలన విజయం తర్వాత వస్తున్న ఈ చిత్రం ఓ ప్రీక్వెల్‌గా రూపొందుతోంది. ఇటీవలి విడుదల చేసిన పోస్టర్‌లో రిషబ్ శెట్టి శౌర్యంతో నిండిన రౌద్రమయమైన రూపంలో కనిపిస్తూ అభిమానుల హృదయాలను కొల్లగొట్టారు. గతంలో విడుదలైన ఫస్ట్ లుక్‌లో ఆయన ముఖం కనిపించకపోవడంతో అభిమానుల్లో కొంత ఆసక్తి నెలకొంది. కానీ తాజా పోస్టర్‌లో ఆయన పవర్‌ఫుల్ అవతారంతో సినిమాపై అంచనాలు పెరిగిపోయాయి.
ఈ ప్రతిష్ఠాత్మక చిత్రాన్ని ‘కేజీఎఫ్’, ‘సలార్’ వంటి బ్లాక్‌బస్టర్ చిత్రాలను నిర్మించిన హోంబలే ఫిలింస్ సంస్థ నిర్మిస్తోంది. మొదటి భాగం అంచనాలకు మించిన విజయం సాధించడంతో, ఈ ప్రీక్వెల్‌ను కేవలం దక్షిణాది భాషలకే కాకుండా, హిందీ, ఇంగ్లీష్, బెంగాలీ వంటి భాషల్లోనూ విడుదల చేయడానికి నిర్మాతలు సిద్ధమవుతున్నారు.
మ్యూజిక్ విభాగంలో కూడా ప్రేక్షకులు అదే స్థాయి అద్భుతాన్ని ఆశించవచ్చు. తొలి భాగానికి హృద్యమైన సంగీతాన్ని అందించిన అజనీష్ లోక్‌నాథ్ ఈ ప్రాజెక్ట్‌కీ సంగీతం అందిస్తున్నారు. కథ, నటన, దర్శకత్వం, నిర్మాణం, సంగీతం అన్నదానిలోనూ ‘కాంతార: చాప్టర్ 1’ ప్రేక్షకులకు మరో విశిష్ట అనుభవాన్ని అందించనుందని అంచనాలు ఉన్నాయి.
Vana Mahotsavam : రాష్ట్ర మహిళలను కోటీశ్వరులుగా తీర్చిదిద్దే కార్యక్రమం చేపట్టాం: సీఎం రేవంత్ రెడ్డి