Kantara Beats KGF 2: రూ. 400 కోట్లకు చేరువలో కాంతార మూవీ..!

కన్నడ మూవీ కాంతార గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే అనిపిస్తుంది.

  • Written By:
  • Publish Date - November 11, 2022 / 01:36 PM IST

కన్నడ మూవీ కాంతార గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే అనిపిస్తుంది. ఈ మధ్య కాలంలో వచ్చిన సినిమాలలో బ్లాక్ బ్లస్టర్ సాధించిన మూవీ ఇది. బాహుబలి 2, RRR, KGF 2 సినిమాలు అత్యంత భారీ విజయాలు అందుకున్నా.. వీటి బడ్జెట్‌లు కూడా అదే స్థాయిలో ఉన్నాయి. కానీ.. కాంతార మూవీ సుమారు రూ.20 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కింది. ఈ చిత్రం బాక్సాఫీసు వద్ద కాసుల వర్షం కురిపిస్తోంది. ఇప్పటివరకు ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా రూ.400 కోట్లకు చెరువవుతుంది. ఈ మూవీ ఇంకా వసూళ్లు రాబడుతూనే ఉంది. ఈ చిత్రం ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా రూ. 360 కోట్లతో రన్ అవుతోంది.

అడ్వెంచర్ యాక్షన్ థ్రిల్లర్ గా వచ్చిన ఈ మూవీ 40 రోజుల్లో రూ. 350 కోట్ల బెంచ్‌మార్క్‌ను అధిగమించింది. ప్రపంచవ్యాప్తంగా ఈ మూవీ రూ. 400 కోట్ల గ్రాస్ సాధించే అవకాశముంది. కాంతార మూవీ భారతదేశంలో రూ. 275 కోట్లకు పైగా రన్ అవుతుండగా అందులో దాదాపు రూ. 173 కోట్లు ఒక్క కర్ణాటక నుంచే ఉన్నాయి. ఈ చిత్రం ప్రస్తుతం రాష్ట్రంలో అత్యధిక వసూళ్లు సాధించిన రెండవ చిత్రంగా ఉంది. అయితే ఈ మూవీ కలెక్షన్స్ త్వరలో KGF 2 మూవీని అధిగమించే ఛాన్స్ ఉంది. కన్నడ స్టార్ హీరో యష్ నటించిన KGF 2 చిత్రం కర్నాటకలో అత్యధికంగా రూ.182 కోట్లను రాబట్టింది.

కాంతారను నిర్మించిన హోంబాలే ఫిలిమ్స్ నుంచి వచ్చిన అన్ని చిత్రాల్లో కాంతారనే అత్యధిక ఫుట్ ఫాల్స్ నమోదు చేసుకున్న మూవీగా చరిత్ర సృష్టించింది. ఈ మూవీ కౌంట్ కోటి రూపాయల దాకా ఉందట. కెజిఎఫ్ 1 ఫుల్ రన్ లో 75 లక్షలు, కెజిఎఫ్ 2 ఫైనల్ ఫిగర్ 72 లక్షలు ఉండగా కోళ నృత్యంతో రిషబ్ శెట్టి చేసిన మేజిక్ వాటిని పెద్ద మార్జిన్ తో దాటేసింది. ఇదిలా ఉంటే కాంతార హిందీ బాక్సాఫీస్ వద్ద అద్భుతంగా ఆడుతోంది. ఈ చిత్రం 28 రోజుల టిక్కెట్ విండోలో సుమారు 70 కోట్ల నెట్ వసూలు చేసింది. వచ్చే వారం అజయ్ దేవగన్ దృశ్యం 2, వరుణ్ ధావన్ భేదియా విడుదలయ్యేలోపు రూ. 100 కోట్లకు చేరుకుంటుందని అంచనా వేస్తున్నారు.