కన్నడ హీరో రిషబ్ శెట్టి స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘కాంతార చాప్టర్ 1’. హిట్ మూవీ ‘కాంతార’కు ప్రీక్వెల్‌గా రూపొందిన ఈ సినిమా.. దసరా కానుకగా థియేటర్లలోకి వచ్చింది. బాక్సాఫీస్ దగ్గర భారీ వసూళ్లతో బ్లాక్ బస్టర్ విజయం సాధించింది. సక్సెస్ ఫుల్ గా రెండో వారం పూర్తి చేసుకోబోతున్న ఈ పీరియడ్ యాక్షన్ మూవీ.. రూ.700 కోట్ల క్లబ్ దిశగా పయనిస్తోంది. దీపావళిని పురస్కరించుకుని చిత్ర బృందం తాజాగా కొత్త ట్రైలర్ ను రిలీజ్ చేసింది.
‘కాంతార చాప్టర్ 1’ సినిమాలోని కీలక సన్నివేశాలతో ఈ ట్రైలర్ ను కట్ చేశారు. 3 నిమిషాల్లో కథేంటి అనేది చూపించారు. కాంతార వరల్డ్ ను పరిచయం చేస్తూ, ప్రధాన పాత్రదారులందరికీ ప్రాధాన్యత ఉండేలా రూపొందించిన ఈ ట్రైలర్ ఆకట్టుకుంటోంది. రిషబ్ శెట్టి వివిధ లుక్స్ లో మెస్మరైజ్ చేశారు. హీరోయిన్ రుక్మిణి వసంత్ అందంగా కనిపిస్తూనే, యాక్షన్ సీన్స్ లో ఆశ్చర్యపరిచింది. గుల్షన్ దేవయ్య, జయరాం ఇతర పాత్రల్లో నటించారు.