Sampath J Ram : బుల్లితెర నటుడు ఆత్మహత్య.. టీవీ పరిశ్రమలో విషాదం..

కన్నడ(Kannada) టీవీ(TV) పరిశ్రమకు చెందిన సంపత్ రామ్(Sampath J Ram)అనే యువ నటుడు ఆత్మహత్య చేసుకొని మరణించాడు.

Published By: HashtagU Telugu Desk
Kannnada TV Actor Sampath J Ram Passes away

Kannnada TV Actor Sampath J Ram Passes away

ఇటీవల సినీ, టీవీ పరిశ్రమలలో వరుస విషాదాలు చోటు చేసుకుంటున్నాయి. పలువురు ప్రముఖులు మరణించి పరిశ్రమలో విషాదాన్ని మిగిల్చారు. తాజాగా ఓ బుల్లితెర నటుడు(Actor) ఆత్మహత్య చేసుకోవడం సంచలనంగా మారింది. కన్నడ(Kannada) టీవీ(TV) పరిశ్రమకు చెందిన సంపత్ రామ్(Sampath J Ram)అనే యువ నటుడు ఆత్మహత్య చేసుకొని మరణించాడు.

సీరియల్స్ లో నటుడిగా ప్రయాణం మొదలుపెట్టి పలు సీరియల్స్ తో గుర్తింపు తెచ్చుకున్నాడు. అగ్నిసాక్షి అనే సీరియల్ తో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు సంపత్. కన్నడ సినిమాలలో కూడా చిన్న చిన్న పాత్రలు పోషించాడు. అయితే గత కొంతకాలంగా సంపత్ కు సరైన అవకాశాలు రావట్లేదు. తాను అనుకున్నట్టుగా అవకాశాలు రాకపోవడంతో కొన్నాళ్లుగా బాధపడుతూ డిప్రెషన్ లోకి వెళ్ళిపోయి ఆత్మహత్య చేసుకున్నాడని సన్నిహితుల సమాచారం.

సంపత్ కు ఒక సంవత్సరం క్రితం వివాహం అవ్వడం గమనార్హం. ఇంతలోనే ఇలా జరగడంతో అతని భార్య, కుటుంబం తీవ్ర దుఃఖంలో మునిగిపోయారు. 35 ఏళ్ళ వయసులోనే ఇలా సంపత్ ఆత్మహత్య చేసుకోవడంతో తోటి నటీనటులు జీర్ణించుకోలేకపోతున్నారు. పలువురు కన్నడ సినీ, టీవీ ప్రముఖులు సంపత్ కు నివాళులు అర్పిస్తున్నారు. ఆత్మహత్య కావడంతో పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

 

Also Read :   Chalaki Chanti: జబర్దస్త్ చంటికి అసలు ఏమయ్యింది.. ప్రస్తుతం పరిస్థితి ఎలా ఉందో తెలుసా?

  Last Updated: 25 Apr 2023, 11:12 PM IST