Kannappa : మంచు విష్ణు ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ‘కన్నప్ప’ చిత్రంపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. శివ భక్తుడైన కన్నప్ప జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో ప్రభాస్, మోహన్‌లాల్, అక్షయ్ కుమార్ వంటి అగ్ర తారలు కీలక పాత్రలు పోషించడంతో ఈ ఆసక్తి మరింత పెరిగింది. ప్రచారంలో భాగంగా చిత్ర బృందం శనివారం ఈ సినిమా ట్రైలర్‌ను విడుదల చేసింది.
ట్రైలర్‌లో మంచు విష్ణు తిన్నడు పాత్రలో కనిపించగా, ప్రభాస్ రుద్ర పాత్రలో ఆకట్టుకున్నారు. బాలీవుడ్ స్టార్ అక్షయ్‌కుమార్ శివుడి పాత్రలో కనిపించడం విశేషం. ‘మహాభారతం’ సీరియల్‌తో పేరు తెచ్చుకున్న ముకేశ్ కుమార్‌సింగ్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ సినిమా ఈ నెల 27న విడుదల కానుంది.
Pahalgam : పహల్గాంలో ఉగ్రదాడిలో ప్రాణత్యాగం చేసిన ఆదిల్‌కి ప్రభుత్వ గౌరవం