Site icon HashtagU Telugu

Kannappa : కీలక హార్డ్ డిస్క్ మాయం ..విడుదలకు బ్రేక్ పడ్డట్లేనా ?

Kannappa Hard Disk

Kannappa Hard Disk

ప్రముఖ నటుడు మంచు విష్ణు (Vishnu) ప్రధాన పాత్రలో తెరకెక్కుతోన్న పాన్ ఇండియా మూవీ ‘కన్నప్ప’ (Kannappa) ఆఖరి దశకు చేరుకున్న ఈ సమయంలో అనుకోని సమస్య ఎదురైంది. సినిమా విడుదలకు కొన్ని రోజులు మాత్రమే ఉండగా, చిత్రానికి సంబంధించిన ముఖ్యమైన వీఎఫ్ఎక్స్ సన్నివేశాలు ఉన్న హార్డ్ డిస్క్ మాయం (Hard Drive Missing) కావడం కలకలం రేపుతోంది. ఈ ఘటనపై చిత్ర బృందం పోలీసులకు ఫిర్యాదు చేసింది. విజయ్ కుమార్ అనే ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ వివరాల్ని అందజేస్తూ నేరుగా పోలీసు స్టేషన్ కు వెళ్లి పిర్యాదు చేసాడు.

Former Wyra MLA : వైరా మాజీ ఎమ్మెల్యే బానోతు మదన్ లాల్ కన్నుమూత

సుమారు రూ.200 కోట్ల భారీ బడ్జెట్‌తో తెరకెక్కించిన ఈ చిత్రంలో మోహన్ బాబు, మోహన్ లాల్, ప్రభాస్, అక్షయ్ కుమార్, దేవరాజ్ లాంటి ప్రముఖులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ముంబైలోని హెచ్ఐవీఈ స్టూడియోస్‌లో రూపొందించిన వీఎఫ్ఎక్స్ ఫుటేజ్‌తో కూడిన హార్డ్ డిస్క్‌ను 24 ఫ్రేమ్స్ ఫిల్మ్ ఫ్యాక్టరీ, హైదరాబాద్‌కు కొరియర్ చేశారు. ఈ హార్డ్ డిస్క్ మే 25న ఆఫీస్‌కు చేరగా, రఘు అనే ఆఫీస్ బాయ్ అందుకున్నట్లు తెలుస్తోంది. అయితే ఆ హార్డ్ డిస్క్‌ను అతను అదే ఆఫీస్‌లో పనిచేసే మహిళకు ఇచ్చి, ఆ తర్వాత ఆ ఇద్దరూ అదృశ్యమయ్యారట.

ఈ వ్యవహారం వెనక కుట్ర ఉందని, సినిమా విడుదలను అడ్డుకునే ఉద్దేశంతో హార్డ్ డిస్క్‌ను దొంగిలించారని విజయ్ కుమార్ ఆరోపించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. సీసీ కెమెరా ఫుటేజ్‌ ఆధారంగా రఘు, ఆ మహిళ కదలికలపై విచారణ చేపట్టారు. ఈ ఘటన వల్ల ‘కన్నప్ప’ మూవీ విడుదలపై అనిశ్చితి ఏర్పడే అవకాశముంది. అయితే నిర్మాతల బృందం సమస్యను వేగంగా పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటోంది.