Kannappa First Look : మంచు విష్ణు కన్నప్ప ఫస్ట్ లుక్ రిలీజ్

బాణం విల్లుని పట్టుకోని మంచు విష్ణు కనిపిస్తుండగా..వెనుకాల శివలింగం కనిపించేలా డిజైన్ చేయడం పోస్టర్ కే హైలైట్

Published By: HashtagU Telugu Desk
Kannappa First Look

Kannappa First Look

నేడు మంచు విష్ణు (Manchu Vishnu) పుట్టిన రోజు సందర్బంగా ఆయన డ్రీమ్ ప్రాజెక్ట్ కన్నప్ప (Kannappa ) నుండి ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేసి అభిమానుల్లో సంబరాలు నింపారు. పాన్ ఇండియా గా తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని 24 ఫ్రేమ్స్ ఎంట‌ర్‌టైన్‌మెంట్స్‌, ఏవీఏ ఎంట‌ర్‌టైన్‌మెంట్ బ్యాన‌ర్‌ల‌పై అత్యంత ప్ర‌తిష్టాత్మ‌కంగా మోహన్ బాబు నిర్మిస్తుండగా.. బాలీవుడ్ డైరెక్టర్ ముఖేష్ కుమార్ సింగ్ డైరెక్ట్ చేస్తున్నాడు. ఎపిక్ మహాభారతం సీరియల్ ని డైరెక్ట్ చేసిన ముఖేష్ కుమార్ (Mukesh Kumar) ఈ సినిమాను తెరకెక్కిస్తుండడం తో బాలీవుడ్ లోను అంచనాలు మొదలయ్యాయి.

We’re now on WhatsApp. Click to Join.

అలాగే ఈ సినిమాకి రైటర్ గా మంచు విష్ణు పేరు పడుతుండడం విశేషం. స్టోరీ డెవలప్మెంట్ విషయంలో మంచు విష్ణుకి పరుచూరి గోపాలకృష్ణ, ఈశ్వర్ రెడ్డి, నాగేశ్వర్ రెడ్డి, తోట ప్రసాద్ అండగా నిలిచారు. ఇక ఫస్ట్ లుక్ (Kannappa First Look) చూస్తే..బాణం విల్లుని పట్టుకోని మంచు విష్ణు కనిపిస్తుండగా..వెనుకాల శివలింగం కనిపించేలా డిజైన్ చేయడం పోస్టర్ కే హైలైట్ గా నిలిచింది. చాలా పాజిటివ్ వైబ్స్ క్రియేట్ చేసిన ఈ పోస్టర్ ..సినిమా ఫై అమాంతం అంచనాలు పెంచేసింది.

అలాగే ఈ సినిమాలో ప్రభాస్ (Prabhas) ఓ కీలక పాత్రలో నటిస్తోన్న సంగతి తెలిసిందే. సినిమాలో ప్రభాస్ శివుడి పాత్రలో కనిపించనున్నారు. ప్రభాస్‌కు జోడిగా నయనతార పార్వతి పాత్రలో కనిపించనుందని తెలుస్తోంది. ఆంతే కాదు మోహ‌న్‌లాల్ , శివ‌రాజ్‌కుమార్, మోహన్ బాబులు కూడా పలు పాత్రల్లో కనిపించబోతున్నారు. దాదాపుగా 100 కోట్ల బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు.

Read Also : Pushpa 2 : పుష్ప 2 బడ్జెట్ పెరిగిందా.. 200 కోట్లు అనుకుంటే ఇప్పుడు..!

 

  Last Updated: 23 Nov 2023, 12:38 PM IST