Site icon HashtagU Telugu

Kannappa First Day Collections : కన్నప్ప ఫస్ట్ డే టార్గెట్ గట్టిగానే పెట్టుకున్నాడే..!!

Manchu Vishnu gives Clarity on Kannappa Movie Release Date

Kannappa

డేరింగ్ అండ్ డాషింగ్ స్టార్ విష్ణు మంచు నటించిన డ్రీమ్ ప్రాజెక్ట్ ‘కన్నప్ప’ (Kannappa) జూన్ 27న ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రభాస్ , అక్షయ్ కుమార్ , కాజల్ తదితరులు కీలక పాత్రల్లో నటించడం తో ఈ సినిమాకు భారీ స్థాయిలో అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే అడ్వాన్స్ బుకింగ్స్ మంచి స్థాయిలో రన్ అవుతున్నాయి. ఈ సినిమా ఓపెనింగ్ డే క‌లెక్ష‌న్స్‌ పై టాలీవుడ్‌ పరిశ్రమలోనూ, అభిమానుల్లోనూ భారీ ఆసక్తి నెలకొంది. ఫస్ట్ డేనే ఈ చిత్రం రూ.100 కోట్ల టార్గెట్ ను సాధిస్తుందని చిత్ర బృందం ఆశిస్తోంది.

Tejeshwar Murder Case : తేజేశ్వర్ హత్య కేసులో బిగ్ ట్విస్ట్!

సుమారు రూ.200 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా, డిజిటల్ & శాటిలైట్ హక్కులను ఇంకా అమ్మలేదని సమాచారం. ఓటీటీ సంస్థలు ఇచ్చిన డీల్స్ విష్ణు మంచుకు నచ్చకపోవడంతో, సినిమా విడుదల తర్వాతే వాటిని అమ్మాలని నిర్ణయించుకున్నారు. అంతేకాదు మెజారిటీ ఏరియాలలో సొంతంగా సినిమాను విడుదల చేయడంతో రిస్క్ తీసుకున్న విష్ణు ఈ సినిమాతో భారీ రాబడులు ఆశిస్తున్నారు. కమిషన్ బేస్ మీద ఎగ్జిబిటర్లకు సినిమా ఇవ్వడం ద్వారా తొలిరోజు భారీగా వసూలు చేయాలన్నది గోల్.

ఈ సినిమాలో విష్ణు మంచు టైటిల్ పాత్రలో కనిపించగా, అక్షయ్ కుమార్ పరమేశ్వరునిగా, కాజల్ అగర్వాల్ పార్వతీగా, ప్రభాస్ రుద్రుడిగా కీలక పాత్రలు పోషించారు. అలాగే మోహన్ లాల్, మోహన్ బాబు, శరత్ కుమార్ లాంటి సీనియర్ స్టార్‌లు కూడా నటించడంతో పాన్-ఇండియా స్థాయిలో సినిమా మీద బజ్ ఏర్పడింది. నార్త్ ఇండియాలో ప్రభాస్, అక్షయ్‌ల కారణంగా క్రేజ్ పెరిగింది. ఇక దక్షిణభారత దేశాల్లోనూ మాస్, క్లాస్ ప్రేక్షకుల మధ్య ఆసక్తి భారీగా ఉంది. మరి విష్ణు టార్గెట్ రిచ్ అవుతాడా అనేది చూడాలి.