Vishnu Manchu: కన్నప్ప టీజర్ రిలీజ్ డేట్ ఫిక్స్‌

  • Written By:
  • Publish Date - June 7, 2024 / 09:35 PM IST

Vishnu Manchu: మంచు విష్ణు ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ కన్నప్ప రోజురోజుకూ ఊపందుకుంటోంది. ఇటీవల జరిగిన కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ 2024లో ఈ సినిమా టీజర్ ను ప్రదర్శించగా, డిజిటల్ రిలీజ్ డేట్ ను ప్రకటించారు. కన్నప్ప టీజర్ ను 2024 జూన్ 14న పలు భాషల్లో విడుదల చేయనున్నారు. తన హృదయంలో ఈ సినిమాకు ప్రత్యేక స్థానం ఉందని విష్ణు ఈ సినిమాపై భారీ అంచనాలు వ్యక్తం చేశారు. మరి మనల్ని సర్ప్రైజ్ చేయడానికి మేకర్స్ ఏం చేస్తారో వేచి చూడాల్సిందే.

ప్రభాస్, మోహన్ బాబు, అక్షయ్ కుమార్, మోహన్ లాల్, శివ రాజ్ కుమార్, నయనతార, కాజల్ అగర్వాల్, మధుబాల వంటి స్టార్ హీరోలతో నటించిన ఈ చిత్రం ఓ ఎపిక్ సినిమాటిక్ ఎక్స్ పీరియన్స్. 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ, ఆవా ఎంటర్టైన్మెంట్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ భారీ విఎఫ్ఎక్స్ చిత్రానికి స్టీఫెన్ దేవస్సీ, మణిశర్మ సంగీతం అందిస్తున్నారు.