Upendra Direct Rajinikanth: క్రేజీ కాంబినేషన్.. ఉపేంద్ర డైరెక్షన్ లో రజనీకాంత్ మూవీ, బాక్సాఫీస్ బద్ధలే!

ఒకవైపు హీరోయిజం, మరోవైపు డైరెక్షన్ రెండు పడవలపై ప్రయాణం చేసినవాళ్లు చాలామంది ఉన్నారు.

Published By: HashtagU Telugu Desk
Upendra

Upendra

చిత్రపరిశ్రమ (Industry)లో హీరోలు డైరెక్టర్స్ గా, డైరెక్టర్స్ హీరోలుగా మారినవాళ్లు చాలామంది ఉన్నారు. ఒకవైపు హీరోయిజం, మరోవైపు డైరెక్షన్ రెండు పడవలపై ప్రయాణం చేసినవాళ్లు కూడా చాలామంది ఉన్నారు. అప్పటి సీనియర్ ఎన్టీఆర్ నుంచి ఇప్పటి విశ్వక్ సేన్ లాంటి హీరోలు తమ దర్శకత్వ ప్రతిభతో రాణించిన సందర్భాలున్నాయి. అయితే తాజాగా కబ్జా మూవీతో ప్రేక్షకులను పలుకరించిన కన్నడ సూపర్ స్టార్ ఉపేంద్ర (Upendra) క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. ఆయనకు కన్నడతో పాటు తెలుగు నాట కూడా మంచి ఫాలోయింగ్ ఉంది. గతంలో వచ్చిన సినిమాలు అందుకు నిదర్శనంగా కూడా.

ఈ నేపథ్యంలో ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో (Upendra) ఆసక్తికర కామెంట్స్ చేయడం ఆకట్టుకుంది. ఇక తనకు ఉపేంద్రతో ఎప్పుడైనా కలిసి పనిచేసే అవకాశం వస్తే కచ్చితంగా చేస్తానని, ఆకట్టుకునే స్క్రిప్ట్ లభిస్తే, భవిష్యత్తులో అతని దర్శకత్వంలో ఒక కన్నడ చిత్రం చేయాలనుకుంటున్నాను అని రజనీకాంత్ ఓ సందర్భంలో చెప్పాడు. అయితే ఉపేంద్ర ఈ కామెంట్స్ పై స్పందిస్తూ “ఈ ఇండస్ట్రీలో ప్రతి ఒక్కరూ రజినీ సార్‌తో కలిసి పనిచేయాలని కోరుకుంటారు, ఇది ఒక కల లాంటిది.” అని ఆయన అన్నారు.

రజనీకాంత్ తనతో కలిసి పని చేయాలనే కోరికను వ్యక్తం చేసిన తర్వాత ఏదైనా చేయాలనే ఆలోచన ఉందా అని అడిగినప్పుడు, ఉపేంద్ర ఇలా బదులిచ్చారు, “ఈ రోజుల్లో నేను నా నటనా జీవితంలో బిజీగా ఉన్నందున  దర్శకత్వ బాధ్యతలను దూరంగా ఉన్నా. ఇప్పుడు నా కెరీర్ ఎండింగ్ లో ఉంది’’ అని ఉపేంద్ర (Upendra) అన్నారు.  ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ఈ ప్రాజెక్ట్ కార్యరూపం దాల్చితే అటు కన్నడ, ఇటు తమిళ లో రికార్డులు బద్ధలు కొట్టడం ఖాయమేనని ఇరువురి ఫ్యాన్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

Also Read: Kangana Caravan: కంగనా కార్వాన్ చాలా కాస్ట్ లీ.. బాలీవుడ్ లోనే ఖరీదైన ఇంటీరియర్

  Last Updated: 20 Mar 2023, 04:12 PM IST