Site icon HashtagU Telugu

Rukmini Vasanth : విజయ్ తోనే రుక్మిణి.. అమ్మడి ఫ్యాన్స్ కి సూపర్ న్యూస్..!

Rukmini Vasanth NTR Movie

Rukmini Vasanth NTR Movie

సప్త సాగరాలు దాటి సినిమాతో ప్రేక్షకులను అలరించిన రుక్మిణి వసంత్ ఇప్పుడు సౌత్ పరిశ్రమలో క్రేజీ హీరోయిన్ గా మారింది. కన్నడ లో రక్షిత్ శెట్టి తో కలిసి సప్త సాగరాలు దాటి సినిమాలో నటించి ఆమె ప్రియ పాత్రలో ప్రేక్షకుల హృదయాలను కొల్లగొట్టింది. ఈ క్రమంలో అమ్మడు సౌత్ లో ఒక రేంజ్ పాపులారిటీ సంపాదించింది. సప్త సాగరాలు దాటి సినిమా తర్వత ఇప్పటికే తమిళంలో ఒక సినిమా ఆఫర్ అందుకున్న రుక్మిణి టాలీవుడ్ కి ఎంట్రీ ఇవ్వబోతుందని తెలుస్తుంది.

రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ (Vijay Devarakonda) సినిమాలో రుక్మిణి వసంత్ నటిస్తుందని తెలుస్తుంది. విజయ్ ప్రస్తుతం గౌతం తిన్ననూరి డైరెక్షన్ లో సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాలో ఆల్రెడీ శ్రీలీల హీరోయిన్ గా చేస్తుంది. ఈ మూవీ తర్వాత విజయ్ దేవరకొండ రవికిరణ్ కోలా డైరెక్షన్ లో సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాలో విజయ్ సరసన రుక్మిణి వసంత్ నటించే ఛాన్స్ ఉందని తెలుస్తుంది.

రుక్మిణి (Rukmini Vasanth) తెలుగు ఎంట్రీ కోసం ఆడియన్స్ అంతా ఎంతో ఉత్సాహంగా ఎదురుచూస్తున్నారు. విజయ్ లాంటి హీరో సినిమాతో అమ్మడు టాలీవుడ్ ఎంట్రీ ఫ్యాన్స్ ని సర్ ప్రైజ్ చేస్తుంది. దిల్ రాజు నిర్మిస్తున్న ఈ సినిమాతో రుక్మిణి తెలుగులో కూడా స్టార్ క్రేజ్ తెచ్చుకుంటుందని అంచనా వేస్తున్నారు.

విజయ్ దేవరకొండ ఈ సినిమా తర్వాత శ్యాం సింగ రాయ్ ఫేమ్ రాహుల్ సంకృత్యన్ తో ఒక సినిమా లైన్ లో పెట్టాడు. ఈ సినిమాను కూడా పీరియాడికల్ డ్రామాగా రాబోతుందని తెలుస్తుంది. విజయ్ దేవరకొండ రాబోతున్న ఈ 3 సినిమాలతో తన సత్తా చాటాలని చూస్తున్నారు.  ఫ్యాన్స్ కూడా విజయ్ సాలిడ్ హిట్ కోసం ఎదురుచూస్తున్నారు. ఐతే ఈ కథలు మాత్రం నెక్స్ట్ లెవెల్ లో ఉండబోతున్నాయని తెలుస్తుంది.

Also Read : Jai Hanuman : చిరంజీవి ప్లేస్ లో ఆ కోలీవుడ్ స్టార్..?