Site icon HashtagU Telugu

Neha Shetty : తెలుగులో క్రేజ్ తెచ్చుకుంటూ బిజీ అవుతున్న మరో కన్నడ భామ.. ఒక్క పెద్ద సినిమా పడితే నేహాశెట్టి స్టార్ అవ్వడం ఖాయం..

Kannada Actress Neha Shetty Getting Offers and goes Viral in Telugu Film Industry

Kannada Actress Neha Shetty Getting Offers and goes Viral in Telugu Film Industry

ముంగారు మాలె అనే కన్నడ సినిమాతో సినీ పరిశ్రమలోకి ఎంటర్ అయింది కన్నడ భామ నేహాశెట్టి(Neha Shetty). కన్నడలో ఆ ఒక్క సినిమా చేసి తెలుగులో ఆకాష్ పూరి(Akash Puri) సరసన మెహబూబా(Mehabooba) సినిమాతో ఎంట్రీ ఇచ్చింది. ఈ సినిమా ఫ్లాప్ అయినా నేహశెట్టి పాత్రకి మంచి గుర్తింపు వచ్చింది. ఆ తర్వాత గల్లీ రౌడీ(Gully Rowdy) సినిమా చేసి మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ లో ఓ చిన్న పాత్ర చేసింది. ఇక సిద్ధూ జొన్నలగడ్డతో(Siddhu Jonnalagadda) డీజే టిల్లు(DJ Tillu) సినిమాలో కనపడి అందర్నీ రాధికా క్యారెక్టర్ తో మెప్పించింది.

డీజే టిల్లు సినిమాతో ఓవర్ నైట్ స్టార్ అయిపోయింది నేహశెట్టి. ఈ సినిమాతో తెలుగు యూత్ లో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకుంది. ఇక సోషల్ మీడియాలో హాట్ హాట్ ఫోటోలు షేర్ చేస్తూ ఫాలోయింగ్ కూడా పెంచుకుంటుంది. ప్రస్తుతం నేహశెట్టి చేతిలో మూడు సినిమాలు ఉన్నాయి. కార్తికేయ సరసన బెదురులంక 2012 సినిమా చేయగా ఇది రేపు ఆగస్టు 25న రిలీజ్ కానుంది. ఆ తర్వాత కిరణ్ సబ్బవరం సరసన రూల్స్ రంజన్ సినిమాతో సెప్టెంబర్ లో రానుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి వచ్చిన ఓ పాట బాగా వైరల్ అయింది. అందులో నేహా డ్యాన్స్ అయితే సోషల్ మీడియాలో రీల్స్ రూపంలో తెగ షేర్ అవుతుంది. ఈ రెండు సినిమాల తర్వాత విశ్వక్సేన్ సరసన గ్యాంగ్స్ అఫ్ గోదావరి సినిమాలో నటిస్తుంది. ఈ సినిమా నుంచి కూడా ఒక పాట రిలీజ్ అయి వైరల్ గా మారింది.

దీంతో గత కొన్నాళ్లుగా నేహశెట్టి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ మూడు సినిమాలే కాకుండా ఇంకో సినిమా కూడా ఒప్పుకున్నట్టు సమాచారం. ఈ మూడిట్లో ఏ ఒక్కటి హిట్ అయినా నేహశెట్టికి ఇంకా ఆఫర్స్ రావడం గ్యారెంటీ. చూడటానికి చాలా బాగుంటుంది, బోల్డ్ సీన్స్ కి కూడా ఓకే చెప్తుంది, డ్యాన్స్, యాక్టింగ్ బాగా చేస్తుంది. దీంతో ఈ అమ్మడికి కుర్రకారు ఫిదా అయిపోతున్నారు. అసలు నేహశెట్టి రేంజ్ కి ఒక్క పెద్ద సినిమా పడితే స్టార్ అయిపోవడం ఖాయం అని ఆమె అభిమానులు అంటున్నారు.

మన తెలుగు ఇండస్ట్రీలో ఎప్పట్నుంచో కన్నడ భామల హవా సాగుతూనే ఉంది అనుష్క ముందు నుంచి మొన్న పూజా హెగ్డే వరకు రీసెంట్ గా వచ్చిన కృతి శెట్టి.. వీళ్లంతా కన్నడ భామలే. ఇప్పుడు నేహశెట్టి కూడా వాళ్ళ లాగే మంచి సక్సెస్ సాధిస్తుందని అంతా భావిస్తున్నారు. చూడాలి మరి నేహాశెట్టి కెరీర్ తెలుగులో ఎలా ఉండబోతుందో.

 

Also Read : King Of Kotha : దుల్కర్ సల్మాన్ ‘కింగ్ ఆఫ్ కొత్త’ మూవీ ఎలా ఉందంటే..