Site icon HashtagU Telugu

Shiva Rajkumar: హాస్పిటల్లో చేరిన శివరాజ్ కుమార్.. ఆందోళన చెందుతున్న అభిమానులు?

Bengaluru

Bengaluru

కన్నడ సూపర్ స్టార్ శివరాజ్ కుమార్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. ఈయన దివంగత కన్నడ కంఠీరవ రాజ్‌ కుమార్‌ వారసుడు అన్న విషయం తెలిసిందే. అంతేకాకుండా దివంగత నటుడు, స్టార్ హీరో అయిన పునీత్ రాజ్ కుమార్ సోదరుడు అన్న విషయం కూడా మనందరికి తెలిసిందే. కాగా శివరాజ్ కుమార్ కు కన్నడలో ఏ రేంజ్ లో అభిమానులు ఉన్నారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆయన సినిమాలు విడుదల అవుతున్నాయి అంటే చాలు థియేటర్లకు ప్రేక్షకులకు క్యూ కడుతుంటారు.

ఇకపోతే ఈ మధ్యకాలంలో శివరాజ్ కుమార్ నటించిన సినిమాలు అన్నీ కూడా వరుసగా సూపర్ హిట్ గా నిలుస్తున్న విషయం తెలిసిందే. దీంతో ఈయనకు వరుసగా అవకాశాలు క్యూ కడుతున్నాయి. ఆ సంగతి పక్కన పెడితే తాజాగా అభిమానులు శివరాజ్ కుమార్ పట్ల ఆందోళన చెందుతున్నారు. ఇంతకీ ఏం జరిగింది అసలేమయ్యింది అన్న వివరాల్లోకి వెళితే.. కన్నడ సూపర్ స్టార్ శివరాజ్‌కుమార్ అనారోగ్యానికి గురైనట్లు తెలుస్తోంది. ఆయన సోమవారం బెంగళూరులోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చేరారు. అయితే శివరాజ్ కుమార్ ఎందుకు ఆస్పత్రిలో చేరారో ఇంకా కచ్చితమైన కారణాలు తెలియరాలేదు.

ఆయనను చూసేందుకు మధు బంగారప్ప ఆస్పత్రికి వెళ్లారు. దీంతో శివన్న ఆరోగ్యంపై ఆయన అభిమానులు ఆందోళన చెందుతున్నారు. అయితే డాక్టర్లు అందించిన సమాచారం ప్రకారం శివరాజ్ కుమార్ కు ఎలాంటి తీవ్రమైన ఆరోగ్య సమస్యలు లేవని తెలుస్తోంది. కేవలం జనరల్ చకప్ కోసమే ఆయన ఆసుపత్రికి వచ్చినట్లు సమాచారం. నేడు అనగా మంగళవారం ఉదయం శివన్న డిశ్చార్జి అయ్యే అవకాశం ఉందని సమాచారం. ఇదిలా ఉంటే గత కొన్ని రోజులుగా శివరాజ్‌కుమార్ చాలా బిజీగా ఉన్నారు. ఒకవైపు సినిమా పనులు, మరోవైపు లోక్‌సభ ఎన్నికల ప్రచారం. శివరాజ్‌ కుమార్ భార్య గీత ఈసారి షిమోగా లోక్‌సభ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నారు. అందుకే తన భార్య తరపున ప్రచారం చేసేందుకు పలు పట్టణాల్లో పర్యటిస్తున్నాడు శివన్న.

Exit mobile version