కోలీవుడ్ స్టార్ హీరో సూర్య (Surya) లీడ్ రోల్ లో శివ (Shiva) దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా కంగువ. యువి క్రియేషన్స్, స్టూడియో గ్రీన్ కలిసి నిర్మించిన ఈ భారీ బడ్జెట్ సినిమా నవంబర్ 14న రిలీజ్ అవుతుంది. ఈ సందర్భంగా సినిమా ప్రమోషన్స్ లో బిజీ బిజీగా ఉన్నాడు సూర్య అండ్ టీం. ఐతే ఈ సినిమా మీద సూర్య కాన్ ఫిడెన్స్ ఆడియన్స్ ని సర్ ప్రైజ్ చేస్తుంది. హాలీవుడ్ లో కొన్ని సినిమాలు చూసి ఇలా మనం ఎందుకు చేయలేకపోతున్నామని అనుకుని ఈ సినిమా చేశామని అన్నారు.
కంగువ (Kanguva) కథ 1000 ఏళ్ల నాటిదని.. తప్పకుండా ఈ సినిమా అందరికీ ఒక మంచి విజువల్ సినిమాటిక్ ఎక్స్ పీరియన్స్ ఇస్తుందని అన్నారు సూర్య. కంగువ సినిమా కోలీవుడ్ బాహుబలి అవుతుందా అంటే.. ప్రతి సినిమాకు ఒక ప్రత్యేకత ఉంటుందని ఆన్సర్ ఇచ్చారు. అంతేకాదు సినిమా 1000 కోట్లు వసూళ్లు రాబడుతుందా అంటే.. ఒక నిర్మాతగా 2000 కోట్లు అయినా కల కనే అవకాశం అతనికి ఉంది కదా అని అన్నారు.
దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్..
తెలుగు ఆడియన్స్ తన మీద చూపిస్తున్న ప్రేమకు చాలా థాంక్స్ అని అన్నారు సూర్య. కంగువ సినిమా తప్పకుండా మీ అందరికీ ఒక మంచి థ్రిల్ అందిస్తుందని అన్నారు. దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందించిన కంగువ సినిమాలో దిశా పటాని హీరోయిన్ గా నటించింది. ఈ సినిమాలో సూర్య డిఫరెంట్ రోల్స్ లో సర్ ప్రైజ్ చేస్తారని తెలుస్తుంది.
సూర్య కంగువ సినిమాలో బాబీ డియోల్ విలన్ గా నటించాడు. యానిమల్ తర్వాత బాబీ డియోల్ కు వరుస సౌత్ సినిమా ఆఫర్లు వస్తున్నాయి.
Also Read : Urvashi Rautela : వాళ్లతో అలా చేయడంలో తప్పేముంది అంటున్న ఊర్వశి రౌతెల..!