Site icon HashtagU Telugu

Suriya: ఫ్యాన్స్ కు ప్రత్యేక విందు ఏర్పాటు చేసిన హీరో సూర్య.. ఎందుకో తెలుసా?

Mixcollage 05 Mar 2024 03 19 Pm 7580

Mixcollage 05 Mar 2024 03 19 Pm 7580

తమిళ హీరో సూర్య గురించి మనందరికీ తెలిసిందే. హీరో సూర్య కొన్ని తెలుగు సినిమాలలో నటించడంతో పాటు ఆయన నటించిన తమిళ సినిమాలు కొన్ని తెలుగులోకి కూడా విడుదల అయ్యాయి. ఈయనకు టాలీవుడ్ లో కూడా భారీగా ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఉంది. హీరో సూర్య హీరోయిన్ జ్యోతిక ప్రేమించి పెళ్లి చేసుకున్న విషయం మనందరికీ తెలిసిందే. ఇకపోతే కోలీవుడ్ స్టార్ హీరో సూర్య సినిమాలతో ప్రేక్షకులను అలరించడమే కాదు, సేవ కార్యక్రమాలతో వారి మనసుని కూడా దోచుకుంటూ ఉంటారు. విద్య, వైద్య విషయంలో ఎన్నో సేవలు చేస్తూ ఉంటారు.

ఇక ప్రకృతి విపత్తు సమయంలో తనవంతు తాను సహాయం అందిస్తూనే, అభిమానుల నుంచి కూడా సేవలు చేస్తుంటారు. అన్నయ్య సూర్య అడుగుజాడల్లోనే తమ్ముడు కార్తీ కూడా నడుస్తూ తన గొప్ప మనసుని చాటుకుంటుంటారు. ఈ క్రమంలోనే ఇటీవల తమిళనాడు రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాలను మిగ్‌జాం తుపాను అతలాకుతలం చేసిన సంగతి తెలిసిందే. ఆ తుఫాన్ తో సెలబ్రిటీస్ సైతం ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఇక ఆ విపత్తు సమయంలో ఈ ఇద్దరి అన్నదమ్ములు బాధితులను ఆదుకునేందుకు ఆర్థిక సాయం ప్రకటించిన సంగతి తెలిసిందే. అలాగే తుపాను ప్రభావిత ప్రాంతాల్లో సేవచర్యలు అందించాలని తమ అభిమానులకు పిలుపునిచ్చారు.

ఇక తమ అభిమాన హీరో ఆదేశించిన తరువాత అభిమానులు చేయకుండా ఉంటారా. తుఫాన్ సమయంలో బాధితులను కాపాడి సురక్షిత ప్రాంతాలకు తరలించడం, భోజనం ఏర్పాటు చేయడం వంటి సేవలు చేసి తమ గొప్ప మనుసుని, సూర్య పై తమ అభిమానాన్ని చాటుకున్నారు. ఇక తన పిలుపుకి గౌరవం ఇచ్చి సేవలు చేసిన అభిమానులను గౌరవించేందుకు సూర్య తాజాగా వారందిరి కోసం ఒక విందు ఏర్పాటు చేశారు. తన పిలుపు మేరకు సేవలు అందించిన అభిమానులకు కృతజ్ఞత తెలియజేస్తూ సూర్య ఒక ప్రత్యేక విందుని ఏర్పాటు చేశారు. ఆ విందులో అభిమానులందరికి తానే స్వయంగా వండించి సంతోష పరిచారు. అలాగే వచ్చిన అభిమానులందరికి కూడా సెల్ఫీలు ఇచ్చి ఖుషి చేశారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫొటోలు నెట్టింట వైరల్ గా మారాయి. ఆ ఫోటోలను చూసిన అభిమానులు సూర్య పై కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.

Exit mobile version