Kangana Twitter: ట్విట్టర్ లోకి కంగనా రీ ఎంట్రీ.. ఫస్ట్ అప్ డేట్ ఇదే!

కంగనా రెండేళ్ల తర్వాత ట్విట్టర్ (Twitter) లోకి అడుగు పెట్టింది. అయితే, ఆమెకు ఇంకా బ్లూ టిక్ ఇవ్వలేదు.

Published By: HashtagU Telugu Desk
Kangana ranaut bollywood

Kangana

బాలీవుడ్ లో (Bollywood)  ఫైర్ బ్రాండ్ వెంటనే కంగనా రనౌత్ (Kangana) పేరు గుర్తుకువస్తుంది. ఏ విషయాన్నైనా ధైర్యంగా వ్యక్తపర్చడంలో ఈ బ్యూటీ ముందుంటుంది. అయితే కంగనా రెండేళ్ల తర్వాత ట్విట్టర్ (Twitter) లోకి అడుగు పెట్టింది. అయితే, ఆమెకు ఇంకా బ్లూ టిక్ ఇవ్వలేదు. 2021 మే నెలలో ఆమె ట్విట్టర్ అకౌంట్‌ను పర్మనెంట్‌గా సస్పెండ్ చేశారు. సుమారు రెండేళ్ల తర్వాత ఆయన ట్విట్టర్ ఖాతా మళ్లీ రీస్టోర్ అయింది. 2021 మే తర్వాత ఇన్నాళ్లకు మళ్లీ ఆమె (Kangana) ట్విట్టర్ ఖాతాను పునరుద్ధరించారు. దీంతో కంగనా ఫ్యాన్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

ఈ సందర్భంగా ఆమె జనవరి 24వ తేదీన తొలి ట్వీట్ చేశారు. హలో ఎవ్రివన్, మళ్లీ ఇక్కడకు రావడం బాగుందని ఆమె ట్వీట్ చేశారు. అలాగే, ఆమె తన ఎమర్జెన్సీ సినిమా గురించి అప్‌డేట్ ఇచ్చారు. కంగనా రనౌత్ (Kangana) ట్విట్టర్‌ గైడ్‌లైన్స్‌ను ఉల్లంఘించారని, వివాదాస్పద ట్వీట్ చేశారని పేర్కొంటూ ఆమె ఖాతాను శాశ్వతంగా సస్పెండ్ చేశారు. విద్వేషపూరిత ప్రవర్తన, అబ్యూజివ్ బిహేవియర్ ద్వారా చాలా సార్లు ట్విట్టర్ పాలసీని ఉల్లంఘించారని వివరించారు. పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల తర్వాత జరిగిన హింస గురించి ఆమె వివాదాస్పద ట్వీట్ చేశారు. ఈ ట్వీట్ తర్వాతే ఆమె అకౌంట్‌ను సస్పెండ్ (Suspend) చేశారు.

Also Read: Mahesh Thanks KTR: హైదరాబాద్ లో బిగ్ ఈవెంట్.. కేటీఆర్ కు మహేశ్ బాబు థ్యాంక్స్!

  Last Updated: 25 Jan 2023, 02:14 PM IST